అఘోరాతి ఘోరం... తల్లి శవంపై కూచొని పూజలు!!

Update: 2018-10-04 09:30 GMT

తిరుచ్చిలో ఒక అఘోరా, తన తల్లి శవంపై కూర్చుని పూజలు చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో.. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తల్లి శవంపై కూర్చుని ఓ అఘోరా అంత్యక్రియలు నిర్వహించిన సంఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో చోటుచేసుకుంది. వారణాసి నుండి వచ్చిన అఘోరాలు.. స్థానిక సాంప్రదాయలకు భిన్నంగా అంత్యక్రియలు నిర్వహించటం, స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది
.

తిరుచ్చి జిల్లా తిరువెరుంబూర్ సమీపంలోని అరియమంగళంకు చెందిన మేరి అనే మహిళ మృతిచెందింది. దీంతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుమారుడు మణికంఠన్ వచ్చాడు. మణికంఠన్ వారణాసిలో అఘోరాగా శిక్షణ తీసుకుని అరియమంగళంలోని జయ్ అఘోరా ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు. మణికంఠన్ అఘోరా కావటంతో వారణాసిలోని మిత్రులను రప్పించి తన తల్లి అంత్యక్రియలు తమ శైలిలో నిర్వహించారు. అంత్యక్రియల్లో భాగంగా మణికంఠన్ అఘోరా.. తన తల్లి మేరి శవంపై కూర్చుని పూజలు నిర్వహించారు. అనంతరం అఘోరాలే సమాధి చేశారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న గ్రామస్తులంతా భయాందోళన చెందారు. క్షుద్రపూజల తరహాలో అఘోరాలు శవంపై కూర్చుని అంత్యక్రియలు నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది. సమీప గ్రామాల్లో ఈ ఘటన సంచలనంగా మారింది. 

Similar News