SBI vs Post Office: ఎస్బీఐ వర్సెస్ పోస్టాఫీసు.. అధిక వడ్డీ ఎక్కడ లభిస్తుంది..!

SBI vs Post Office: చాలామంది ప్రజలు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని కోరుకుంటారు.

Update: 2022-09-29 06:01 GMT

SBI vs Post Office: ఎస్బీఐ వర్సెస్ పోస్టాఫీసు.. అధిక వడ్డీ ఎక్కడ లభిస్తుంది..!

SBI vs Post Office: చాలామంది ప్రజలు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని కోరుకుంటారు. ఇందులో భాగంగా ఎక్కడ ఎక్కువ వడ్డీ లభిస్తే అక్కడ పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. అయితే చాలామంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనే ఆధారపడుతారు. ఎందుకంటే వీటిపై బ్యాంకులు, పోస్టాఫీసులు ఎక్కువ వడ్డీ చెల్లిస్తాయి. అయితే చాలామందికి ఈ రెండింటిలో ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువ వడ్డీ లభిస్తుందో తెలియదు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

వాస్తవానికి బ్యాంకుల్లో నిర్ణీత సమయం డిపాజిట్ చేసిన డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటారు. అలాగే పోస్టాఫీసులో డిపాజిట్ చేసిన మొత్తాన్ని టైమ్ డిపాజిట్లు అంటారు. మీరు 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల కాలానికి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ చేస్తే 6.7% చొప్పున వడ్డీ చెల్లిస్తారు. ఉదాహరణకి పోస్టాఫీసులో ఖాతా తెరిచి 8 లక్షల 35 వేల రూపాయలు పెట్టుబడి పెడితే 3 సంవత్సరాల తర్వాత మీరు 10 లక్షల 19 వేల రూపాయల కంటే ఎక్కువ రాబడిని పొందుతారు. ఇందులో మీకు 1 లక్షా 84 వేల 194 రూపాయల వడ్డీ లభిస్తుంది. అంటే మొత్తం 10 లక్షల 19 వేల 194 రూపాయలు అవుతుంది.

ఎస్‌బీఐ ఎఫ్‌డీపై 6.10 శాతం వడ్డీ

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు SBI స్వాతంత్ర్య పండుగ సందర్బంగా అన్‌సావ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రారంభించారు. దీని కింద 15 ఆగస్టు 2022 నుంచి 28 అక్టోబర్ 2022 వరకు ఖాతాను తెరవవచ్చు. ఈ పథకం కింద బ్యాంక్ 6.10% చొప్పున వార్షిక వడ్డీని అందిస్తోంది. అయితే సీనియర్ సిటిజన్లకు 6.60% చొప్పున వడ్డీ చెల్లిస్తారు. మీరు ఈ పథకంలో ఖాతా తెరిచి 8 లక్షల 35 వేల రూపాయలు పెట్టుబడి పెడితే 3 సంవత్సరాల తర్వాత మీరు 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ రాబడిని పొందుతారు. ఇందులో మీకు 1 లక్ష 66 వేల రూపాయల వడ్డీ లభిస్తుంది. అంటే మొత్తం 10 లక్షల 1 వేల 296 రూపాయలు అవుతుంది.

పొదుపు విషయంలో పోస్టాఫీసు ఉత్తమం

ఇప్పుడు రెండు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మధ్య తేడా గమనిస్తే పోస్టాఫీసు మెరుగ్గా కనిపిస్తోంది. SBIలో 3 సంవత్సరాల FDకి 6.10 శాతం వడ్డీ లభిస్తే పోస్టాఫీసులో అదే కాలానికి టైమ్ డిపాజిట్‌పై 6.7% వడ్డీ లభిస్తుంది. మీరు పొదుపు కోసం పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పోస్టాఫీసు ఉత్తమమని చెప్పవచ్చు.

Tags:    

Similar News