Post Office: మహిళల కోసం సూపర్ స్కీమ్.. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే..!
Mahila Samman Savings Certificate: ప్రస్తుతం ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. సంపాదించడంలో ఎంత ఆసక్తి చూపిస్తున్నారో పొదుపు చేయడంలో కూడా అంతే ఆసక్తి చూపిస్తున్నారు.
Mahila Samman Savings Certificate: ప్రస్తుతం ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. సంపాదించడంలో ఎంత ఆసక్తి చూపిస్తున్నారో పొదుపు చేయడంలో కూడా అంతే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ సైతం పలు ఆకర్షణీయమైన పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పోస్టాఫీస్ మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమృద్ది పొదుపు పథకాన్ని తీసుకొచ్చారు. ఇంతకీ పథకం ఏంటి.? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టాఫీస్ మహిళా సమృద్ధి పొదుపు పథకం పేరుతో ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇది కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చారు. ఎలాంటి రిస్క్ లేకుండా మీరు పెట్టుబడి పెట్టిన మొత్తానికి మంచి రిటర్న్స్ పొందేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకంలో రూ. 1,000 నుంచి 2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ పథకంలో గరిష్టంగా రెండేళ్ల కాల పరిమితి ఉంటుంది. మెచ్యూరిటీ పీరియడ్ పథకం కింద ఖాతా ఓపెన్ చేసిన నాటి నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది.
తక్కువ సమయంలో మంచి వడ్డీ పొందే బెస్ట్ స్కీమ్స్‌లో ఇది ఒకటని చెప్పొచ్చు. ఇక పెట్టుబడిపెట్టిన మొత్తంలో మెచ్యూరిటికే ముందు పార్షియల్ విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. ఖాతాలో ఉన్న మొత్తంలో గరిష్టంగా 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. మహిళలతో పాటు ఆడబిడ్డలకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. మైనర్ బాలికల ఖాతాను సంరక్షకుడు కూడా తెరవచ్చు. దీనికి గరిష్ట వయోపరిమితి అంటూ ఏం లేదు.
ఇక ఈ సేవింగ్ ఖాతాను ఓపెన్ చేయాలనుకునే వారు మీకు స్థానికంగా ఉన్న పోస్టాఫీస్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ ఖాతా ఓపెన్ చేయాలంటే.. పాస్ ఫోటో, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు,పాన్ కార్డు కచ్చితంగా ఉండాలి. మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ పథకం తక్కువ సమయంలో మంచి వడ్డీ పొందాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. పూర్తి వివరాల కోసం మీకు దగ్గరల్లో ఉన్న పోస్టాఫీస్ సందర్శించండి.