Gold Rate Today: ఆభరణాలు కొనేందుకు మంచి ఛాన్స్..తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే ఇదే మంచి సమయమని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు పడిపోయాయి. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు ఏ మేరకు తగ్గాయి..దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలు ఉన్నాయో చూద్దాం.
ఈ ఏడాది చివరి నెల అయిన డిసెంబర్ లో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం పెరిగిన ఈ ధరలు ఈరోజు మళ్లీ తగ్గాయి. దీంతో నేడు శనివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 76,460కి చేరుకుంది. శుక్రవారం ధరలతో పోల్చి చూస్తే 340 రూపాయల వరకు తగ్గింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70, 088కి చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడలో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 76,710 ఉండగా..22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70, 318గా ఉంది. వెండి ధర గురించి తెలుసుకుంటే కిలో వెండి ధర రూ. 130 తగ్గింది. రూ. 89, 860కి పడిపోయింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
ఢిల్లీలో రూ. 76,460, రూ. 70,088
హైదరాబాద్‌లో రూ. 76,710, రూ. 70,318
విజయవాడలో రూ. 77,050, రూ. 70,629
ముంబైలో రూ. 76,590, రూ. 70,208
కోల్‌కతాలో రూ. 76,490, రూ. 70,116
చెన్నైలో రూ. 76,810, రూ. 70,409
బెంగళూరులో రూ. 76,650, రూ. 70,263
ప్రధాన నగరాల్లో వెండి ధరలు:
ముంబైలో రూ. 88,750
కోల్‌కతాలో రూ. 88,630
హైదరాబాద్‌లో రూ. 88,890
విశాఖపట్నంలో రూ. 88,890
ఢిల్లీలో రూ. 89,590
చెన్నైలో రూ. 89,010
బెంగళూరులో రూ. 88,820