Kisan Credit Card: రూ. 3లక్షల లోన్..రూ. 50వేల ఉచిత ఇన్సూరెన్స్..కిసాన్ క్రెడిట్ కార్డు ఇలా దరఖాస్తు చేసుకోండి
Kisan Credit Card: వ్యవసాయం చేయాలంటే పెట్టుబడి అవసరం. దుక్కి దున్నడం నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీలు ఇలా చాలా డబ్బు అవసరం ఉంటుంది. చాలా మంది రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బులు తెచ్చి ఎక్కువ వడ్డీలు చెల్లిస్తూ నష్టపోతుంటారు. ఊర్లలో పేద రైతులు తన పొలంలో సాగుకు పెట్టుబడి పెట్టడానికి అత్యవసరంగా లక్షల రూపాయల అప్పు కావాలంటే ఎంతో మంది ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ రైతులు సులభంగా రూ. 3లక్షల వరకు రుణం తీసుకువచ్చి పం పండించుకునేందుకు వీలు కల్పించేప్రభుత్వ స్కీం ఒకటి ఉందని చాలా మందికి తెలియదు.
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ రెడ్డి కార్డు సులభంగా రూ. 3లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. వడ్డీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాదు మీ పంట చేతికి వచ్చే తర్వాతే కట్టేందుకు బ్యాంకులు వీలు కల్పిస్తున్నాయి. ఈ స్కీములో చేరిన తర్వాత ఏటీఎం ద్వారానే లోన్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు రైతుకు రూ. 50వేల వరకు ఫ్రీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా పొందాలో తెలసుకందాం.
కిసాన్ క్రెడిట్ కార్డు దరఖాస్తులకు డిజిటల్ సంతకం చేసిన ఆన్‌లైన్ భూ రికార్డులు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం ధృవీకరించింది. అయినప్పటికీ, అనేక రాష్ట్రాల్లో భూ రికార్డుల అసంపూర్ణ డిజిటలైజేషన్ కారణంగా, ఈ పత్రాల ప్రామాణికతను నిర్ధారించడానికి బ్యాంకులకు తరచుగా న్యాయపరమైన అభిప్రాయం అవసరం. ఉదాహరణకు, బరోడా రాజస్థాన్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ భూమి యాజమాన్యం, ప్రభుత్వ బకాయిలను ధృవీకరించడానికి తహసీల్దార్ల నుండి ధృవపత్రాలను అంగీకరిస్తుంది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
దశ 1- మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న బ్యాంక్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.
దశ 2 - బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఎంపికల జాబితా నుండి కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎంపికను ఎంచుకోండి.
దశ 3 - ఇప్పుడు 'వర్తించు' ఎంపికపై క్లిక్ చేయండి, ఆ తర్వాత మీ ముందు ఒక అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
దశ 4 - ఫారమ్‌లో అవసరమైన అన్ని వివరాలను పూరించండి, ఆపై 'సమర్పించు'పై క్లిక్ చేయండి.
సమర్పించిన తర్వాత, మీకు అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ వస్తుంది. మీరు ఈ స్కీమ్‌కు అర్హత కలిగి ఉంటే, తదుపరి ప్రాసెసింగ్ కోసం బ్యాంక్ 3-4 రోజులలోపు ఆటోమెటిగ్గా మిమ్మల్ని సంప్రదిస్తుంది.