Gold and Silver Rate Today: మరింత తగ్గిన పసిడి..తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే
Gold and Silver Rate Today: దేశంలో బంగారం ధరలు మరింత తగ్గాయి. దేశీయంగా ఆభరణాలకు డిమాండ్ తగ్గడంతో తులం ధర రూ. 1000లకు వరకు దిగివచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold and Silver Rate Today:బంగారం ధరలు తగ్గుతున్నాయి. దేశీయంగా ఆభరణాలకు డిమాండ్ తగ్గుతుండటంతో తులం బంగారం ధర మరో వెయ్యి రూపాయలు తగ్గింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ. 950తగ్గి రూ. 71,050కి చేరింది .99.9స్వచ్చత కలిగిన తులం బంగారం ధర శనివారం రూ. 72 వేలస్థాయిలో ఉందని ఆల్ ఇండయా సరాఫా అసోసియేషన్ తెలిపింది. బంగారంతోపాటు వెండి ఏకంగా రూ. 4,500తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీధారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి ధర రూ. 85,500కి దిగివచ్చింది. ధర తగ్గకముందు ఇది రూ. 89వేల స్థాయిలో ఉంది. ప్రస్తుతం ఏడాదిలో ఒకేరోజు ఇంతటి స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. బడ్జెట్ లో కస్టమ్స్ సుంకాన్ని 15 నుంచి 6శాతానికి తగ్గించిన నాటి నుంచి ఇప్పటి వరకు బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 69,160 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 69,000పలుకుతోంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,300 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70, 300 ఉంది.
విశాఖలో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 68,920 ఉండగా..22క్యారెట్ల 10 గ్రాముల బంగారం 68, 750 ఉంది
హైదరాబాద్ లో వెండి కిలో ధర రూ. 89,500
విజయవాడలో కిలో ధర రూ. 83,800
విశాఖలో కిలో వెండి ధర రూ. 85,000