Gold Rate Today: వరుసగా మూడోరోజు తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: దేశంలో పసిడి ధరలు మూడోరోజుకూడా తగ్గాయి. వెండి రేట్లు కూడా బంగారం బాటలోనే ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు శుక్రవారం మరోసారి తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 10తగ్గి రూ 63,490కి చేరింది. గురువారం ఈ ధర రూ. 63,500గా ఉండేది. ఇక వందగ్రాముల బంగారం ధరరూ. 100 తగ్గి రూ. 6,34,900కి చేరింది. గ్రాము బంగారం ధర ప్రస్తుతం రూ. 6,349 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు 24క్యారెట్ల బంగారం ధర కూడా రూ 10 తగ్గింది. రూ. 69, 260కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 69,20గా ఉండేది. అదే సమయంలో 100గ్రాముల పసిడి ధర రూ. 100తగ్గింది. రూ. 6,92,600గా ఉంది. ఇదే దేశంలోని కీలక ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. దేశరాజధాని ఢిల్లీలో 22క్యారెట్ల బంగారం ధర రూ. 63,640గా ఉండగా..24క్యారెట్ల బంగారం ధర రూ. 69,410గా నమోదు అయ్యింది. ముంబై, బెంగళూరు, కేరళలో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.చెన్నైలో 22క్యారెట్ల బంగారం ధర రూ. 63,510గాను, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 69,280గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల బంగారం రూ. 63,490గాను.. 24 క్యారెట్ల బంగారం రూ. 69,260గాను నమోదు అయ్యింది.
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 63,490గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 69,260 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో సైతం ఈ రేట్లే ఉన్నాయి. విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు ఉన్నాయి.
వెండి:
దేశంలో వెండి ధరలు కూడా బంగారం బాటలోనే శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,140గా ట్రేడ్ అవుతోంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 81,400కి చేరగా..గురువారం ఈ ధర రూ. 81,500గా ఉండేది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 86,400గా ఉంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 81,400 ఉండా బెంగళూరులో రూ. 80,900 వద్ద కొనసాగుతోంది.