Gold Rate: ఈవారం పెరిగిన బంగారం ధరలు.. దూసుకు పోయిన వెండి ధరలు!
Gold Rate: గత సోమవారం నుంచి శనివారం వరకూ బంగారం ధరల్లో చోటు చేసుకున్న మార్పులు.. చేర్పులపై విశ్లేషణ
బంగారం భారతీయులకు ఎంతో ఇష్టమైన లోహం. బంగారు ఆభరణాలు ధరించడం.. బంగారంతో చేసిన వస్తువులను వాడటం అంటే అమితమైన ఆసక్తి మనకు. పెళ్లిళ్లలో బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత చెప్పలేనిది. వధువుకు ఎంత బంగారం పుట్టింటి వారిస్తారు.. ఎంత బంగారం అత్తింటి వారు పెడతారు వంటి లెక్కలు అన్ని పెళ్ళిళ్ళలోనూ ప్రధాన చర్చనీయాంశాలలో ఒకటిగా ఉంటుంది. ఇక బంగారం ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి మంచి మార్గంగా ఎక్కువ శాతం భావిస్తున్నారు. అటువంటి పసిడికి సంబంధించి ధరలు ఎలా ఉంటున్నాయనేది తెలుసుకోవాలనే ఆసక్తీ చాలా మందిలో ఉంటుంది.
ఇక బంగారం ధరలు, వెండి ధరలు రోజు రోజూ మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వచ్చే మార్పులు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా ధరల్లో మార్పులు నిత్యం జరుగుతుంటాయి. సోమవారం నుంచి శనివారం వరకూ బంగారం మార్కెట్ ధరలు అటూ ఇటూ మారుతూ వస్తాయి. ఆదివారం ట్రేడింగ్ ఉండదు. కొద్దిపాటి మార్పులతో శనివారం సాయంత్రం ఉన్న ముగింపు ధరకే బంగారం అమ్మకాలు జరుగుతాయి.
ఇక గత సోమవారం నుంచి శనివారం వరకూ బంగారం ధరల్లో చోటు చేసుకున్న మార్పులు.. చేర్పులపై విశ్లేషణ.
హైదరాబాద్ లో ఎగుడూ దిగుడూ..
సోమవారం (13 జూలై) పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 46,900 రూపాయలుగానూ, 24 క్యారెట్ల బంగారం 51,180 రూపాయలుగానూ మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. అక్కడి నుంచి వారం మొత్తం బంగారం ధరలు పైకీ కిందికీ మారుతూ వచ్చాయి. శనివారం (18 జూలై) సాయంత్రం 22 క్యారెట్ల బంగారం 47,030 రూపాయలుగానూ, 24 క్యారెట్ల బంగారం 51,320 రూపాయలుగానూ ముగిసాయి. అంటే వారం రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 130 రూపాయలు పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా 140 రూపాయలు పైకెగసింది.
వారంలో చూసుకుంటే జూలై 17వ తేదీ 300 రూపాయలకు పైగా తగ్గింది. అంతకు ముందు రోజు 220 రూపాయలు పెరిగుదల నమోదు చేసింది. మిగిలిన రోజుల్లో కాస్త కాస్త తగ్గుదల కనబరచిన బంగారం ధరలు వారాంతానికి పై దిశలోనే నిలిచాయి.
ఢిల్లీ లో ఇలా..
సోమవారం (13 జూలై) పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 47,850 రూపాయలుగానూ, 24 క్యారెట్ల బంగారం 49,050 రూపాయలుగానూ మార్కెట్లు ప్రారంభం అయ్యాయి. అక్కడి నుంచి వారం మొత్తం బంగారం ధరలు పైకీ కిందికీ మారుతూ వచ్చాయి. శనివారం (18 జూలై) సాయంత్రం 22 క్యారెట్ల బంగారం 47,900 రూపాయలుగానూ, 24 క్యారెట్ల బంగారం 49,100 రూపాయలుగానూ ముగిసాయి. అంటే వారం రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు50 రూపాయలు పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా 50రూపాయలు పైకెగసింది.
వారంలో చూసుకుంటే జూలై 17వ తేదీ 250 రూపాయలకు పైగా తగ్గింది. అంతకు ముందు జూలై 15వ తేదీన 200 పెరుగుదల నమోదు చేసింది. మిగిలిన రోజుల్లో కాస్త కాస్త తగ్గుదల కనబరచిన బంగారం ధరలు వారాంతానికి స్వల్పంగా పై దిశలోనే నిలిచాయి.
వెండి పైకి..కిందికీ..
ఇక దేశీయంగా వెండి ధరలు మాత్రం భారీ ఎగుడు దిగుళ్ళు చూశాయి. జూలై 13 సోమవారం కేజీ వెండి ధర 52,000 రూపాయలు. వారాంతానికి వచ్చేసరికి 52,900 రూపాయలకు చేరుకుంది. మధ్యలో జూలై 15 వ తేదీన ఒక్కసారిగా 800 రూపాయలు భారీ పెరుగుదల నమోదు చేసి53,000 రూపామళ్ళీ పెరుగుతూ వచ్చింది. దీంతో గరిష్ట రికార్డు ధరను వారాంతానికి నమోదు చేసింది.
ఇక శ్రావణ మాసం రానుండడంతో తరువాతి వారాల్లో కూడా బంగారం వెండి ధరలు దిగివచ్చే సూచనలు కనిపించడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.