Gold Rate: బంగారం @ 51,000..వెండి @ 52,000 దూసుకు పోయిన ధరలు!

Gold Rate: వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మరింత పెరిగాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు మళ్ళీ పెరుగుదల నమోదు చేశాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 10) దేశీయంగా పైకెగాశాయి. మరో వైపు వెండి ధరలు ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదు చేశాయి.

Update: 2020-07-10 02:31 GMT

వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మరింత పెరిగాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు మళ్ళీ పెరుగుదల నమోదు చేశాయి. బంగారం ధరలు ఈరోజు (జూలై 10) దేశీయంగా పైకెగాశాయి. మరో వైపు వెండి ధరలు ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శుక్రవారం (10.07.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 400 రూపాయలు పెరిగింది. దీంతో 47,180 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 470 రూపాయలు పెరిగింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,460 రూపాయల వద్ద నిలిచింది.

వెండి ధరలు..

బంగారం ధరలు పెరిగితే, వెండి ధరలు కూడా పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ధరల కంటే ఏకంగా 1880 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 51వేల రూపాయల మార్కుదాటి 52 వేల రూపాయల రికార్డు ధరకు చేరుకుంది. దీంతో కేజీ వెండి ధర 51,990 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాములకు గురువారం నాటి ధరల కంటే పెరిగాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 400 రూపాయలు పెరిగింది. దీంతో 47,180 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 470 రూపాయలు పెరిగింది. దీంతో 51 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 51,460 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీ లో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం ధరతో పోలిస్తే 400 రూపాయలు పెరిగి 47,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం నాటి ధర కంటే 400 రూపాయలు పెరిగింది. దీంతో 48,700 రూపాయలుగా నమోదు అయింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా కేజీకి 1880 రూపాయల పెరుగుదల నమోదు చేశాయి. దీంతో కేజీ వెండి ధర 51వేల రూపాయల మార్కు దాటి 52 వేల రూపాయల రికార్డు ధరవైపు దూసుకెళ్లింది. దీంతో కేజీ వెండి ధర 51,990 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 10-07-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News