Alert: వినియోగదారులు అలర్ట్.. వాటిని అస్సలు షేర్ చేసుకోవద్దు..!
Alert: నేటి కాలంలో ఆధార్, పాన్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రాలు...
Alert: నేటి కాలంలో ఆధార్, పాన్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రాలు. బ్యాంకు ఖాతాల నుంచి అనేక ఇతర పనులకు వీటిని ఉపయోగిస్తున్నారు. వీటివల్ల ఆర్థిక లావాదేవీలు సులభంగా జరుగుతుండగా మరోవైపు ఇవి దుర్వినియోగం అవుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మీరు నిర్దిష్ట కారణం లేకుండా మీ ఆధార్ లేదా పాన్ వివరాలను ఎవ్వరితో షేర్ చేసుకోకూడదు. ఒకవేళ షేర్ చేస్తే మీరే తెలియని ఇబ్బందుల్లో పడుతారు. ఈ రెండు పత్రాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇటీవల మోసగాళ్లు GST ఎగవేత కోసం ఈ వివరాలను ఉపయోగిస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పన్నులు, కస్టమ్స్ (CBIC) ఈ విషయంలో ప్రజలకు సలహా ఇచ్చింది. నిర్ధిష్ట కారణం లేకుండా ఆధార్, పాన్ షేర్ చేయడం వల్ల GST ఎగవేతదారులు వీటిని ఉపయోగిస్తున్నారని తెలిపింది. జిఎస్‌టి ఎగవేత కోసం నకిలీ ఎంటిటీలను సృష్టించడానికి ఆధార్, పాన్ వివరాలను ఉపయోగించవచ్చని సిబిఐసి ట్వీట్‌లో తెలిపింది. అందుకే సరైన కారణం లేకుండా వాటిని షేర్ చేయడం మానుకోవాలని హెచ్చరించింది.
మీ వ్యక్తిగత డేటా, వివరాలను సురక్షితంగా ఉంచుకోవాలని CBIC తెలిపింది. గత సంవత్సరంలో వస్తువులు, సేవల పన్ను (GST) అధికారులు అనేక బోగస్ కంపెనీలను గుర్తించింది. వీరు వాడేవన్ని దొంగిలించిన ఆధార్, పాన్ వివరాలని తేలింది. అందుకే వినియోగదారులు జాగ్రత్తగా ఉండటం మంచిది. దీంతో పాటు ఆధార్ కార్డును తప్పుగా ఉపయోగించి బ్యాంకులలో లోన్లు తీసుకున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆధార్ ఆధారిత లావాదేవీల్లో ఇప్పటి వరకు చాలా మంది వినియోగదారులు మోసపోయారు. మీ వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ షేర్ చేయవద్దని బ్యాంకులు ఎల్లప్పుడూ ఖాతాదారులని హెచ్చరిస్తూనే ఉంటాయి.