Tata Tiago EV: ఒక్క రోజులో 10 వేల బుకింగ్‌లు.. సంచలనం సృష్టిస్తున చౌకైన ఎలక్ట్రిక్ కారు..!
Tata Tiago EV: దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు అయిన టాటా టియాగో EVకి వినియోగదారుల నుంచి గొప్ప స్పందనను వస్తోంది.
Tata Tiago EV: దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు అయిన టాటా టియాగో EVకి వినియోగదారుల నుంచి గొప్ప స్పందనను వస్తోంది. ఒక్కరోజులోనే 10 వేల బుకింగ్స్ వచ్చాయి. టాటా మోటార్స్ సోమవారం బుకింగ్‌ను ప్రారంభించింది. వెంటనే పెద్ద సంఖ్యలో ప్రజలు వెబ్‌సైట్‌కు రావడం ప్రారంభించారు. దీని కారణంగా కంపెనీ వెబ్‌సైట్ డౌన్ అయ్యింది. కాసేపటి తర్వాత టాటా టియాగో ధర ఫిక్స్ అయింది. 8.49 లక్షల నుంచి మొదలై రూ.11.79 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
విశేషమేమిటంటే ప్రారంభ ధరలో 10 వేల మంది వినియోగదారులకు ఉండగా ఇప్పుడు కంపెనీ మరో 10 వేల మంది వినియోగదారులని సంపాదించింది. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ "టియాగో EVకి వచ్చిన అపూర్వ స్పందనతో చాలా ఆనందంగా ఉంది. పరిచయ ధరను అదనంగా పెంచాలని నిర్ణయించాం. 10,000 మంది కస్టమర్‌లు ఉన్నారు. ఈ వాహనాన్ని డీలర్‌షిప్‌లో, ఆన్‌లైన్‌లో రూ.21,000తో బుక్ చేసుకోవచ్చని తెలిపారు"
టాటా టియోగా ఈవీ 24kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 315KM పరిధిని అందిస్తుంది. ఇది కాకుండా 19.2kWh బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది ఇది 250 కిమీల పరిధిని అంచనా వేస్తుంది. ఈ వాహనం 5.7 సెకన్లలో 0 నుంచి 60kmph వరకు వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. లాంగ్ రేంజ్ వెర్షన్ మోటార్ 55kW లేదా 74bhp శక్తిని, 115Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అయితే షార్ట్ రేంజ్ వెర్షన్ మోటార్ 45kW లేదా 60bhp పవర్, 105Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.