Erra Cheera: 'ఎర్రచీర' సినిమా నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ విడుదల

Erra Cheera: 'ఎర్రచీర - ది బిగినింగ్' సినిమా నుంచి 'తొలి తొలి ముద్దు' సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్ చేశారు.

Update: 2024-11-23 13:00 GMT

Erra Cheera: 'ఎర్రచీర - ది బిగినింగ్' సినిమా నుంచి 'తొలి తొలి ముద్దు' సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్ చేశారు. శ్రీరామ్, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుమన్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. ఎన్‌వీవీ సుబ్బారెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

తాజాగా విడుదలైన రొమాంటిక్‌ సాంగ్‌ సినిమాకు మరింత బజ్‌ను క్రియేట్‌ చేయనుంది. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తుండటంతో సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 20న 'ఎర్రచీర - ది బిగినింగ్' చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ కార్యక్రమంలో అతిధిగా వచ్చిన దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేందుకు సుమన్ బాబు తన శక్తిమేరకు కృషిచేస్తున్నారు. సినిమా మీద ప్యాషన్ ఉన్న ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి. మనమంతా వీరికి సపోర్ట్ చేయాలి. రెండేళ్లుగా ఈ సినిమా కోసం సుమన్ బాబు కష్టపడుతున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో ఎర్రచీర ట్రెండ్ అవుతోంది. యాక్షన్, మదర్ సెంటిమెంట్, హారర్ ..ఇవన్నీ ఒక కథలో కలిపి చేయడం అరుదైన ప్రయత్నం. ఇది ఇంతే ఫ్రెష్ గా డిసెంబర్ 20న థియేటర్స్ లోకి రావాలి. ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నా అన్నారు.

చిత్ర దర్శక నిర్మాత, నటుడు సుమన్ బాబు మాట్లాడుతూ “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ తో ఉంటుంది. ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ లో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ రూపొందించాలని అనుకున్నాం. భార్య భర్తల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. రోజులు ఈ పాట చిత్రీకరించాం. మేము అనుకున్నట్లే బాగా వచ్చింది. మా “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేయబోతున్నాం. డిసెంబ్ 15వ తేదీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తాం. తొలి తొలి ముద్దు సాంగ్ రీల్స్, షార్ట్ చేసి మాకు పంపిస్తే ది బెస్ట్ అనిపించిన వాటికి ఫస్ట్ ప్రైజ్ కింద లక్ష రూపాయలు, సెకండ్ ప్రైజ్ గా యాభై వేలు, థర్డ్ ప్రైజ్ గా పాతిక వేలు బహుమతిగా అందిస్తాం అన్నారు.

Tags:    

Similar News