ZELIO Ebikes: స్టూడెంట్స్ స్పెషల్.. రూ. 65 వేలకే జిలియో ఈవీ,పెద్ద ప్లానే ఇది!
ZELIO Ebikes: జెలియో Eeva ZX+ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 67,500. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
ZELIO Ebikes: భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ జెలియో ఈసారి అకర్షణీయమైన డిజైన్, అప్డేటెడ్ Eeva ZX+ EV స్కూటర్‌తో ముందుకు వచ్చింది. Eeva సిరీస్‌లో ఇప్పటికే Eeva, Eeva Eco వంటి మోడళ్లు ఉండగా, ఇప్పెుడు కొత్త Eeva ZX+ ఆవిష్కరించింది. కంపెనీ ప్రకారం ఈ EV విద్యార్థులు, పట్టణ ప్రయాణికుల కోసం రూపొందించారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
కొత్తగా రీడిజైన్ చేయబడిన Eeva ZX+ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిమీ. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 కిమీ వరకు పరుగెత్తుతుంది. స్కూటర్‌లో బలమైన BLDC మోటార్ (60/72V) ఉంది. ఇది 90 కిలోల నుండి 180 కిలోల వరకు లోడింగ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
Eeva ZX+లో భద్రత, సౌకర్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్, ముందు, వెనుక హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. పనితీరు, విశ్వసనీయత యొక్క ఖచ్చితమైన సమతుల్యతను అందించడానికి కంపెనీ హామీ ఇస్తుంది.
Eeva ZX+ ముఖ్యమైన ఫీచర్లలో యాంటీ-థెఫ్ట్ అలారం, రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, USB ఛార్జింగ్ పోర్ట్, అదనపు సౌలభ్యం కోసం డిజిటల్ డిస్‌ప్లే వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. బ్లూ, గ్రే, వైట్, బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
దాని ఆకట్టుకునే పనితీరుతో పాటు Eeva ZX+ లెడ్ యాసిడ్, Li-Ion బ్యాటరీ వేరియంట్‌లపై ఒక సంవత్సరం లేదా 10,000 కిమీ విస్తృతమైన వారంటీతో వస్తుంది. Zeelio కంపెనీ రైడర్లకు అసాధారణమైన విశ్వసనీయతను అందజేస్తుందని హామీ ఇచ్చింది. ఈ స్కూటర్ వివిధ బ్యాటరీ ఎంపికలతో వస్తుంది.
బ్యాటరీ సామర్థ్యం ప్రకారం ధర నిర్ణయించారు. 60V/32AH లెడ్ యాసిడ్ బ్యాటరీతో 60 నుండి 70 కి.మీ పరిధి గల స్కూటర్ ధర రూ. 67,500 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 7 నుండి 8 గంటల సమయం పడుతుంది.
72V/32AH లెడ్ యాసిడ్ బ్యాటరీతో 80 కిమీ రేంజ్ స్కూటర్ ధర రూ. 70,000. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. అలాగే 60V/38AH లెడ్ యాసిడ్ బ్యాటరీతో 80 కి.మీ రేంజ్ స్కూటర్ ధర రూ. 73,300, 7 నుండి 8 గంటల ఛార్జింగ్ సమయం ఉంది.
72V/38AH లెడ్ యాసిడ్ బ్యాటరీతో 100 కి.మీ రేంజ్ స్కూటర్ ధర రూ. 77,000 మరియు పూర్తిగా ఛార్జ్ చేయడానికి 9 నుండి 10 గంటల సమయం పడుతుంది. 60V/30AH Lithium Ion (Li-Ion) బ్యాటరీతో 80 కిమీ రేంజ్ స్కూటర్ ధర రూ. 90,500. 4 గంటల ఛార్జింగ్ సమయం ఉంది.