Car Safety Tips: ఇలాంటి రోడ్డుపై వెళ్లేప్పుడు, ఇంజిన్ ఆఫ్ చేస్తున్నారా.. ప్రమాదాలకు వెల్కం చెప్పినట్లే..

వాస్తవానికి, కొండ రోడ్ల నుంచి టేకాఫ్ చేసేటప్పుడు కారు ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేయడం సురక్షితం కాదు. ఎందుకంటే కారులోని కొన్ని ఫీచర్లు పనిచేయడం మానేస్తాయి. ఈ పరిస్థితిలో మీరు ఇంజిన్‌ను స్విచ్ ఆఫ్ చేస్తే ఏమి జరుగుతుంది,ప్రమాదానికి ఎలా గురవుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

Update: 2024-06-18 02:15 GMT

Car Safety Tips: ఇలాంటి రోడ్డుపై వెళ్లేప్పుడు, ఇంజిన్ ఆఫ్ చేస్తున్నారా.. ప్రమాదాలకు వెల్కం చెప్పినట్లే..

Car Safety Tips: తరచుగా కారు నడుపుతున్నప్పుడు చిన్న చిన్న విషయాలను పట్టించుకోరు. దీని కారణంగా ప్రమాదాల బారిన పడుతుంటారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. పర్వతాలు లేదా వాలుల నుంచి దిగుతున్నప్పుడు, వాహనం ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేసి డ్రైవ్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. దీనికి కారణం తెలిస్తే, కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వాస్తవానికి, కొండ రోడ్ల నుంచి టేకాఫ్ చేసేటప్పుడు కారు ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేయడం సురక్షితం కాదు. ఎందుకంటే కారులోని కొన్ని ఫీచర్లు పనిచేయడం మానేస్తాయి. ఈ పరిస్థితిలో మీరు ఇంజిన్‌ను స్విచ్ ఆఫ్ చేస్తే ఏమి జరుగుతుంది,ప్రమాదానికి ఎలా గురవుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రేక్‌లు విఫలం కావచ్చు..

కారు ఇంజిన్ ఆఫ్ చేసినప్పుడు, దానిలోని కొన్ని బ్రేక్ ఫీచర్లు పని చేయవు. పవర్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్, హిల్ డిసెంట్, ఆటో హోల్డ్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి కొన్ని ఫీచర్లు ఇంజిన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు పని చేయవు. దీని కారణంగా, మీ వాహనం అదుపు తప్పి ప్రమాదానికి దారి తీయవచ్చు.

పవర్ స్టీరింగ్ కూడా పని చేయదు..

ఈ రోజుల్లో చాలా వాహనాలు పవర్ స్టీరింగ్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. ఇది కారును సులభంగా తిప్పడానికి , డ్రైవింగ్‌ను మెరుగ్గా చేస్తుంది. కానీ కారు ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేస్తే, ఈ ఫీచర్ పనిచేయదు. స్టీరింగ్‌ను తిప్పడానికి మీరు చాలా బలాన్ని ప్రయోగించవలసి ఉంటుంది. కొండలు, వాలులలో ఇది చాలా ప్రమాదకరమని నిరూపించవచ్చు.

ABS వ్యవస్థ విఫలమవుతుంది..

ABS అనేది కారు ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్. ఇది ఇంజిన్ నడుస్తున్నప్పుడు మాత్రమే సరిగ్గా పనిచేస్తుంది. ఇంజిన్ ఆఫ్‌లో ఉంటే, ABS సిస్టమ్ విఫలం కావచ్చు. ఇది జరిగితే, బ్రేక్‌లు లాక్ చేసి ఉంటాయి. దీంతో వాహనం రోడ్డుపై స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఇంజిన్ బ్రేకింగ్ పనిచేయదు..

వాలుగా ఉన్న రోడ్డులో డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంజిన్ బ్రేకింగ్ చాలా ముఖ్యం. ఇంజిన్ బ్రేకింగ్ వాహనం వేగాన్ని నియంత్రిస్తుంది. బ్రేక్‌లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ఇంజిన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు ఈ సదుపాయం అందుబాటులో ఉండదు. దీని కారణంగా వాహనం వేగం పెరుగుతుంది. బ్రేకులు ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News