Year Ender 2024: ఆటో మార్కెట్‌కి బై-బై.. బడ్జెట్ ధరలో అదిరిపోయే కార్లు..!

Year Ender 2024: నానాటికీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల మధ్య, ప్రజలు కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు దాని మైలేజీని ఖచ్చితంగా తనిఖీ చేస్తారు.

Update: 2024-12-26 09:23 GMT

Year Ender 2024: నానాటికీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల మధ్య, ప్రజలు కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు దాని మైలేజీని ఖచ్చితంగా తనిఖీ చేస్తారు. మీరు కూడా ఇలాంటి కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే బడ్జెట్ రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉంటే భారతీయ మార్కెట్లో ఉన్న 5 అటువంటి వాహనాల వివరాలను తీసుకొచ్చాము. ఇవి రూ. 7 లక్షల కంటే తక్కువ ప్రారంభ ధరలో లభిస్తాయి. ఈ జాబితాలో మారుతి సుజుకి స్విఫ్ట్ నుండి హ్యుందాయ్ ఎక్స్‌టర్ వరకు అన్నీ ఉన్నాయి. రండి, వాటి ధర, మైలేజీ గురించి తెలుసుకుందాం.

మారుతి సుజుకి స్విఫ్ట్ సరసమైన ఇంధన సామర్త్యం గల వాహనాల జాబితాలో స్విఫ్ట్‌ మొదటి స్థానంలో ఉంచాము. మీరు దీన్ని కేవలం రూ. 6.49 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయచ్చు. దీని 1.2-లీటర్, 3-సిలిండర్ Z-సిరీస్ ఇంజన్ 80.4 బిహెచ్‌పి పవర్, 111.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మైలేజీ గురించి చెప్పాలంటే ఇది ఒక లీటర్ పెట్రోల్‌లో MTతో 24.8 కిమీ, AT తో 25.75 కిమీ పరుగులు పెడుతుంది.

టాటా టియాగో

టాటా టియాగోను జాబితాలో రెండవ స్థానంలో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షలు మాత్రమే. టియాగోలో ఉన్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 84.8 బిహెచ్‌పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మైలేజీ గురించి చెప్పాలంటే ఇది ఒక లీటర్ పెట్రోల్‌లో MTతో 20.09 కిమీ, AT తో 19 కిమీ వరకు నడుస్తుంది.

రెనాల్ట్ క్విడ్

రెనాల్ట్ క్విడ్‌ను జాబితాలో మూడవ స్థానంలో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.69 లక్షలు. రెనాల్ట్‌లో లభించే 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 67 బిహెచ్‌పి పవర్, 91 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మైలేజీ గురించి మాట్లాడుకుంటే.. ఈ ఇంజన్ ఒక లీటర్ పెట్రోల్‌లో MTతో 22.3 కిమీ, AT తో 21.46 కిమీ మైలేజీని ఇవ్వగలదు.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

మారుతి సుజుకి ఈ టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్‌ను కేవలం రూ. 5.54 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకే విక్రయిస్తోంది. ఇది 2 ఇంజన్ ఎంపికలలో అందించారు. మొదటిది 1.0 లీటర్, సింగిల్ సిలిండర్ ఇంజన్ 65.7 బిహెచ్‌పి పవర్, 89.0 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ MTకి 24.35 KMPH, ATకి 25.19 KMPH. రెండవ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 88.5 బిహెచ్ పి పవర్ 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది MTకి 23.56 KMPL, ATకి 24.43 KMPL మైలేజీని అందిస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్

స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తున్న హ్యుందాయ్ నుండి ఈ SUVని కేవలం రూ. 5.99 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయచ్చు. ఇది 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌తో అందించారు, ఇది 68.0 బిహెచ్‌పి పవర్, 95.1 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ధర 8.74 లక్షలు. మైలేజీ గురించి చెప్పాలంటే, ఇది ఒక లీటర్ పెట్రోల్‌లో MTతో 19.4 KM, AT తో 19.2 KM వరకు నడుస్తుంది.

Tags:    

Similar News