Honda Activa 125: కొత్త హోండా యాక్టివా.. తక్కువ వడ్డీతో మీ సొంతం చేసుకోండి..!
Honda Activa 125: హోండా మోటార్ సైకిల్-స్కూటర్ ఇండియా ఇటీవల తన పాపులర్ యాక్టివా 125ని కొత్త అవతార్‌లో విడుదల చేసింది.
Honda Activa 125: హోండా మోటార్ సైకిల్-స్కూటర్ ఇండియా ఇటీవల తన పాపులర్ యాక్టివా 125ని కొత్త అవతార్‌లో విడుదల చేసింది. ఈ స్కూటర్‌కు కొత్త TFT డిస్‌ప్లే, పర్యావరణ అనుకూల సాంకేతికతతో కూడిన ఇంజన్ జోడించారు. మీరు కూడా కొత్త సంవత్సరంలో యాక్టివా కొనాలని ఆలోచిస్తున్నట్లయితే దీని ఆన్-రోడ్ ధర, EMI, డౌన్ పేమెంట్‌తో సహా 2025 హోండా యాక్టివా 125 పూర్తి ఫైనాన్స్ ప్లాన్‌ని తీసుకువచ్చాము. ఈ స్కూటర్ ఇంజన్, మైలేజ్, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
యాక్టివా Activa 125 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. రాజధాని ఢిల్లీలో యాక్టివా బేస్ హెచ్-స్మార్ట్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ.1.08 లక్షలు. ఈ వేరియంట్ కోసం రూ.20 వేలు డౌన్ పేమెంట్ చేస్తే మీరు 9.7 శాతం వడ్డీ రేటుతో 36 నెలలకు దాదాపు రూ. 2800 EMI చెల్లించాల్సి ఉంటుంది. కాగా, DLX వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 1.09 లక్షలు. మీరు ఈ వేరియంట్ కోసం రూ.20 వేలు డౌన్ పేమెంట్ చేస్తే, మీరు 9.7 శాతం వడ్డీ రేటుతో 36 నెలలకు రూ. 2850 EMI చెల్లించాలి. అయితే నగరాలు, డీలర్‌షిప్‌లను బట్టి హోండా Activa 125 ఆన్-రోడ్ ధర మారచ్చు. ఇది కాకుండా బైక్ లోన్ లభించే వడ్డీ రేటు శాతం మీ వ్యక్తిగత క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు 8-10 శాతం మధ్య బైక్ రుణాలను అందిస్తాయి.
Honda Activa 125 Features And Specifications
హోండా యాక్టివా 125కి కొత్త 4.2-అంగుళాల TFT డిస్‌ప్లే జోడించారు. మీరు దీన్ని హోండా రోడ్‌సింక్ యాప్ ద్వారా ఆపరేట్ చేయచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లను కొత్త యాక్టివా 125కి కూడా కనెక్ట్ చేయచ్చు.
కొత్త TFT డిస్‌ప్లే ద్వారా, రైడర్‌లు టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, మెసేజ్ అలర్ట్‌ల వంటి సమాచారాన్ని పొందచ్చు. ఇది కాకుండా కొత్త యాక్టివాలో USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. యాక్టివా టెలిస్కోపిక్ ఫోర్క్, సింగిల్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్‌ను పొందుతుంది. ఇది 125 123.92cc OBD2B కంప్లైంట్ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 8.31 బిహెచ్‌పి పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇప్పుడు ఐడల్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఈ స్కూటర్ దాదాపు 50KMPL మైలేజీని ఇస్తుంది.