Maruti Recalls Alto K10: రీకాల్ అలర్ట్.. డేంజర్ జోన్‌లో ఆల్టో కె10.. అర్జెంట్‌గా షోరూమ్‌లో ఉండాలి..!
Maruti Recalls Alto K10: మారుతి సుజుకి ఆల్టో K10 గేర్‌బాక్స్ లోపం కారణంగా కంపెనీ రీకాల్ చేసింది. సర్వీస్ సెంటర్ ద్వారా సమస్యను పరిష్కరించనున్నారు.
Maruti Recalls Alto K10: ఇండియాలోని ప్రసిద్ధ కార్లలో ఒకటైన మారుతి సుజుకి ఆల్టో K10 గేర్‌బాక్స్ లోపం కారణంగా కంపెనీ రీకాల్ చేసింది. హ్యాచ్‌బ్యాక్‌లోని 2,550 యూనిట్లను రీకాల్ చేసినట్లు కార్ల తయారీ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. సర్వీస్ సెంటర్ ద్వారా సమస్యను పరిష్కరించే వరకు వాహన యజమానులు తమ కార్లను నడపడం మానుకోవాలని సూచించారు. ఈ ఏడాది కార్ల తయారీ సంస్థ రీకాల్ చేయడం ఇది మూడోసారి. అంతకుముందు, మారుతి మార్చిలో సుమారు 15,000 బాలెనో, వ్యాగన్ఆర్ యూనిట్లను, గత నెలలో సుమారు 87,600 S-ప్రెస్సో, ఈకో మోడళ్లను రీకాల్ చేసింది.
ఆల్టో కె10లో ఉపయోగించిన స్టీరింగ్ గేర్‌బాక్స్‌లో లోపం వల్ల డ్రైవింగ్‌లో సమస్యలు తలెత్తవచ్చని మారుతీ సుజుకీ తెలిపింది. ఈ కార్ల తయారీ సంవత్సరాన్ని మారుతీ వెల్లడించలేదు. అయితే కార్‌మేకర్ అఫిషియల్ డీలర్‌షిప్ వర్క్‌షాప్‌ల వాహన యజమానులను సంప్రదిస్తాయని వెల్లడించింది. అవసరమైతే డిఫెక్టివ్ యూనిట్‌ను చెక్ చేసి రీప్లేస్ చేస్తుంది.
స్టీరింగ్ గేర్‌బాక్స్ లోపం ఉన్న అన్ని ఆల్టో కె10లను తమ సర్వీస్ సెంటర్‌ల ద్వారా చెక్ చేసి సరిచేస్తామని మారుతీ సుజుకి తెలిపింది. ఇందుకోసం వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయరు. నివేదిత లోపం అరుదైన సందర్భాల్లో వాహనం స్టీరింగ్ సామర్థ్యాన్నిఎఫెక్ట్ చేయవచ్చు. చాలా జాగ్రత్తతో కస్టమర్‌లు వాహనాలను నడపాలని సూచించారు.
మారుతి సుజుకి ఆల్టో K10 కొత్త జనరేషన్ మోడల్ 1.0 లీటర్ K సిరీస్ డ్యూయల్-జెట్, డ్యూయల్ VVT ఇంజన్‌తో వస్తుంది. ఇది మాన్యువల్, ఆటో గేర్ షిఫ్ట్ (AGS)ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. ఆల్టో కె10 ఇండియన్ మార్కెట్లో అత్యంత ఇంధన సామర్థ్య వాహనాల్లో ఒకటి. ఈ కారు లీటరుకు 24.90 కిమీల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.
Alto K10 క్యాబిన్‌లో SmartPlay టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది Apple CarPlay, Android Auto కనెక్టివిటీని అందిస్తుంది. హ్యాచ్‌బ్యాక్‌లో రిమోట్ కీ యాక్సెస్, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేయగల ORVM, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో ఎబిఎస్ విత్ ఇబిడి, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.
మారుతీ సుజుకి ఆల్టో కె10ని ఆగస్ట్ 18, 2022న సేల్‌కు తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). హ్యాచ్‌బ్యాక్ CNG వెర్షన్‌తో సహా తొమ్మిది వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఆల్టో K10 ధర రూ. 5.96 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. దాని న్యూ జనరేషన్ మారుతి సుజుకి ఆల్టో K10 దాని ముందు మోడల్‌తో పోలిస్తే అనేక మార్పులతో వస్తుంది. ఐదవ తరం హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా, హ్యాచ్‌బ్యాక్ కొత్త గ్రిల్, హెడ్‌లైట్, టైల్‌లైట్ యూనిట్‌లతో అప్‌డేట్ చేయబడిన డిజైన్‌తో వస్తుంది. ఆల్టో K10 ఆరు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.