Tesla Cybercab Robotaxi: మళ్లీ అద్భుతం చేసిన ఎలాన్ మస్క్.. డ్రైవర్స్ లెస్ కార్ వచ్చేస్తోంది!

Tesla Cybercab Robotaxi: నో స్టీరింగ్ వీల్.. నో పెడల్స్! ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Tesla CyberCab Robotaxis ఎట్టకేలకు విడుదలైంది.

Update: 2024-10-11 12:04 GMT

Tesla Cybercab Robotaxi

Tesla Cybercab Robotaxi: నో స్టీరింగ్ వీల్.. నో పెడల్స్! ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Tesla CyberCab Robotaxis ఎట్టకేలకు విడుదలైంది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కంపెనీ కొత్త సైబర్ క్యాబ్ రోబోటాక్సీని ఆవిష్కరించారు. దీంతో చాలా రోజుల నిరీక్షణకు తెరపడింది. ముఖ్యంగా ఇది డ్రైవర్ లేని కారు. టెస్లా కంపెనీ కొత్త కారు పేరు 'సైబర్‌క్యాబ్' (రోబోటాక్సీ). ఈ కారు ఫీచర్లు, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

కాలిఫోర్నియాలోని బర్‌బాంక్‌లో జరిగిన కార్యక్రమంలో సైబర్‌క్యాబ్ అధికారికంగా ప్రారభించారు. ఈ కార్యక్రమంలో ఎలోన్ మస్క్ రోబోటాక్సీ డిజైన్ చూపించారు. సైబర్‌క్యాబ్ ఉత్పత్తి 2026 నాటికి ప్రారంభమవుతుందని ఎలాన్ మస్క్ తెలిపారు.




ఈ కొత్త కారులో స్టీరింగ్ వీల్ లేదా పెడల్స్ లేవు. వీటిని తయారు చేసే ముందు తప్పనిసరిగా ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుండి అనుమతి పొందాలి. దీని డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా ఉంది. దీనిలో డోర్స్ సీతాకోకచిలుక రెక్కల వలె పైకి తెరుచుకుంటాయి. ఒక చిన్న క్యాబిన్ అందించారు. అందులో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే కూర్చోవచ్చు.

ప్రోటోటైప్ మోడల్‌లో స్టీరింగ్ వీల్ లేదా పెడల్స్ ఉండవు. ప్లగ్‌ని ఛార్జ్ చేయడానికి స్థలం లేదు. రోబోటాక్సీ వైర్‌లెస్‌గా విద్యుత్‌ను అందుకుంటుంది. వాహనం బ్యాటరీని ఛార్జ్ చేస్తుందని కంపెనీ CEO, ఎలాన్ మస్క్ తెలిపారు. అంటే ఇది స్మార్ట్‌ఫోన్ లాగా వైర్‌లెస్ ఛార్జర్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ కారు ధర $30,000 కంటే తక్కువగా ఉంటుందని అంచనా.

డ్రైవర్ లేని కార్లు నడపడం సురక్షితం కాదని సాధారణంగా చెబుతారు. టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో అనేక లోపాలు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే ఇది ఉన్నప్పటికీ, స్వయంప్రతిపత్తమైన కార్లు సాధారణ కార్ల కంటే 10 నుండి 20 రెట్లు సురక్షితమైనవి (ప్రస్తుతం డ్రైవర్ లేని కార్లు). సిటీ బస్సులకు మైలుకు రూ.1తో పోలిస్తే వీటి ధర కేవలం రూ.0.20. ఉంటుందని ఎలోన్ మస్క్ అన్నారు.

టెస్లా వచ్చే ఏడాది టెక్సాస్, కాలిఫోర్నియాలో పూర్తిగా అటానమస్ డ్రైవింగ్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. సైబర్‌క్యాబ్ ఉత్పత్తి 2026 నాటికి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. అయితే ఇది 2027 వరకు పొడిగించవచ్చని ఎలాన్ మస్క్ చెప్పారు. ఇంకా టెస్లా ఆప్టిమస్ రోబోట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది $20,000 నుండి $30,000 ధరలో అందుబాటులో ఉంటుంది.

Tags:    

Similar News