Tata Cars : బడ్జెట్ రెడీ చేస్కోండి.. కొత్త ఏడాది మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లు కలిగిన టాటా కంపెనీ కార్లు

Update: 2024-12-01 14:42 GMT

Tata Motors 2025 Cars : టాటా మోటార్స్ కార్లకు భారతీయ కస్టమర్లలో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటోంది. మీరు కూడా సమీప భవిష్యత్తులో కొత్త టాటా కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, తప్పనిసరిగా ఈ వార్తను చివరి వరకు చదవండి. టాటా మోటార్స్ అనేక కొత్త మోడళ్లను వచ్చే ఏడాది.. అంటే 2025లో భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. గాడీవాడీలో ప్రచురించబడిన ఒక వార్త ప్రకారం, టాటా రాబోయే కార్లలో ఎలక్ట్రిక్ ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. టాటా మోటార్స్ కంపెనీ నుండి రాబోయే మూడు కార్ల ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్

భారతీయ కస్టమర్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో టాటా టియాగో ఒకటి. ఇప్పుడు కంపెనీ టాటా టియాగో అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అప్‌డేటెడ్ టాటా టియాగోలో కస్టమర్‌లు కొత్త హెడ్‌ల్యాంప్, టెయిల్‌ల్యాంప్, బంపర్, కొత్తగాడిజైన్ చేసిన ఇంటీరియర్స్‌ను కొత్త ఫీచర్లతో చూడవచ్చు. అయితే, కారు పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం లేదు.

టాటా టిగోర్ ఫేస్‌లిఫ్ట్

టాటా టిగోర్ భారతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన సెడాన్ కార్లలో ఒకటి. ఇప్పుడు కంపెనీ టాటా టిగోర్‌ను అప్‌డేట్ చేయబోతోంది. అప్‌డేటెడ్ టాటా టిగోర్ వచ్చే ఏడాది అంటే 2025లో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుంది. టాటా టిగోర్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్, ఎక్ట్సీరియర్‌లో కస్టమర్లు పెద్ద మార్పులను చూస్తారని వార్తలొస్తున్నాయి. అయితే, కారు పవర్‌ట్రెయిన్‌లో మార్పులు అసంభవం.

టాటా హారియర్ ఈవీ

టాటా హారియర్ భారతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన ఎస్‌యూవీలలో ఒకటి. ప్రస్తుతానికి టాటా మోటార్స్ కంపెనీ టాటా హారియర్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను 2025లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా హారియర్ ఈవీ టెస్టింగ్ సమయంలో భారతీయ రోడ్లపై కనిపించింది. టాటా హారియర్ ఈవీలో కంపెనీ 60kWh బ్యాటరీని ఉపయోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్లగలదు.

Tags:    

Similar News