Vespa: బంపర్ ఆఫర్.. అప్రిలియా, వెస్పా స్కూటర్లపై రూ.13వేల తగ్గింపు.. లిమిటెడ్ ఆఫర్

Update: 2024-12-04 16:00 GMT

Vespa, Aprilia Discount Offers: పియాజియో ఇండియా వెస్పా, అప్రిలియా స్కూటర్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. అప్రిలియా, వెస్పా స్కూటర్లపై కంపెనీ రూ.13,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. పియాజియో అందించే ఈ తగ్గింపు ఆఫర్ డిసెంబర్ 25 వరకు అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 3, 2024 - డిసెంబర్ 25, 2024 మధ్య కొనుగోలు చేసిన స్కూటర్లపై ఈ తగ్గింపు ఆఫర్ వర్తిస్తుంది. ప్రస్తుతం కంపెనీ భారతదేశంలో 5 వెస్పా , 5 అప్రిలియా మోడల్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఈ రెండు బ్రాండ్‌లపై ఈ తగ్గింపు ఆఫర్ వర్తిస్తోంది. డిస్కౌంట్ ఆఫర్స్ విషయానికొస్తే... మీరు క్యాష్ డిస్కౌంట్, ఉచిత బీమా లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూపంలో దాన్ని పొందవచ్చు. అయితే, మోడల్, డీలర్‌షిప్ స్థానాన్ని బట్టి ఈ ఆఫర్ మారవచ్చు.

మీరు పియాజియో ఇండియా నుండి వెస్పా, అప్రిలియా స్కూటర్‌లను కొనడానికి ప్లాన్ చేస్తున్నారా? ఐతే, ఈ ఆఫర్స్ మీ కోసమే అంటోంది కంపెనీ. అప్రిలియా, వెస్పా స్కూటర్‌లపై రూ. 13,000 వరకు తగ్గింపును అందిస్తోంది.

వెస్పా 6 కొత్త మోడల్స్

Vespa ఇండియాలో 6 కొత్త మోడల్స్‌ను పరిచయం చేసింది. VXL 125, VXL 150, SXL 125, ZX 125, SXL 150 పేరిట వెస్పా లాంచ్ చేసిన ఈ ఆరు మోడల్స్ కూడా ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లుగా కంపెనీ చెప్పుకొచ్చింది.

అప్రిలియాలో 5 కొత్త మోడల్స్

అప్రిలియా భారతదేశంలో 5 కొత్త మోడల్స్‌ను పరిచయం చేసింది. అప్రిలియా లాంచ్ చేసిన ఆ 5 స్కూటర్ల జాబితాలో SR 160, SR 125, SXR 160, స్టార్మ్ 125, SXR 125 ఉన్నాయి.

Tags:    

Similar News