Honda Amaze : కేవలం రూ.7.99లక్షలకే 19 kmpl మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, లెవల్-2 ADAS ఫీచర్లున్న హోండా అమేజ్ త్వరపడండి

Update: 2024-12-04 17:06 GMT

New Honda Amaze Car prices and Features: హోండా కార్స్ ఇండియా అధికారికంగా భారతదేశంలో కొత్త తరం అమేజ్‌ను విడుదల చేసింది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 7,99,900 నుండి ప్రారంభమవుతాయి. అప్‌డేట్ చేసిన సబ్-ఫోర్-మీటర్ సెడాన్ 3 వేరియంట్‌లలో, సింగిల్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. దీని CVT వేరియంట్ మైలేజ్ 19.46 kmpl. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, లెవల్-2 ADAS వంటి అనేక అధునాతన సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు ఇతర ఫీచర్లను తెలుసుకుందాం.

కొత్త హోండా అమేజ్ డిజైన్

కొత్త హోండా అమేజ్ ఎక్ట్సీరియర్ డిజైన్‌లో కంపెనీ పలు మార్పులుచేర్పులు చేసింది. ఇది కొత్త ఫ్రంట్, రియర్ బంపర్స్, గ్రిల్, ఇంటిగ్రేటెడ్ LED DRL లతో కూడిన LED హెడ్‌ల్యాంప్స్, LED ఫాగ్ లైట్స్, కొత్త అల్లాయ్ వీల్స్, బ్లైండ్-స్పాట్ మానిటర్స్, అప్‌డేటెడ్ బూట్‌లిడ్ సెక్షన్‌ను వంటి మార్పులు కనిపిస్తాయి.

లెవెల్ 2 ADAS, 6 ఎయిర్‌బ్యాగ్స్

2024 హోండా అమేజ్‌లో లెవల్ 2 ADAS సూట్, డ్యూయల్-టోన్ క్యాబిన్ థీమ్, ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, వెనుక AC వెంట్స్, వైర్‌లెస్ ఛార్జర్, 6 ఎయిర్‌బ్యాగ్స్, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto వంటి ఫీచర్స్ కనెక్టివిటీ ఉన్నాయి.

ఇంజిన్ పవర్ ట్రైన్

కొత్త హోండా అమేజ్‌లో 1.2-లీటర్, 4-సిలిండర్ i-VTEC పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 89bhp పవర్, 110Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్, CVT యూనిట్లు ఉన్నాయి.

మైలేజీ ఎంత?

కొత్త హోండా అమేజ్ మ్యాన్యువల్ వేరియంట్‌పై 18.65 kmpl మైలేజీని ఇస్తుంది. CVT వేరియంట్ మైలేజ్ 19.46 kmpl గా ఉంది.

ధర ఎంత?

కొత్త హోండా అమేజ్ V ట్రిమ్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 7,99,900 నుండి ప్రారంభమవుతాయి. VX ట్రిమ్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 9,09,900 నుండి ప్రారంభమవుతాయి. ZX ట్రిమ్ ఎక్స్-షోరూమ్ ధర రూ 9,69,000 నుండి ప్రారంభమవుతుంది.

వారంటీ ఎంత?

కొత్త హోండా అమేజ్ 6 విభిన్న బాహ్య రంగు ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. సెడాన్ కిలోమీటర్ క్యాపింగ్ లేకుండా 3 సంవత్సరాల ప్రామాణిక వారంటీతో రానుంది. ఇది కిలోమీటర్ క్యాపింగ్ లేకుండా 7 సంవత్సరాల వరకు పొడిగిస్తారు.

416 లీటర్ల బూట్ స్పేస్

ఈ కారు బూట్ సైజును కూడా 416 లీటర్లకు పెంచారు. అందుకే కొత్త అమేజ్ మునుపటి మోడల్ కంటే కొంచెం పెద్దదనే చెప్పుకోవచ్చు. ఇది ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుంది.

Tags:    

Similar News