Mahindra Bolero: మహీంద్రా స్టాక్ క్లియరెన్స్ సేల్.. బొలెరో పై రూ.1.20లక్షల తగ్గింపు.. డిసెంబర్ 31 వరకు మాత్రమే

Mahindra Bolero: మహీంద్రా తన బొలెరో ఎస్ యూవీ పై డిసెంబర్‌లో ఇయర్ ఎండ్ సందర్భంగా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Update: 2024-12-04 02:00 GMT

Mahindra Bolero: మహీంద్రా స్టాక్ క్లియరెన్స్ సేల్.. బొలెరో పై రూ.1.20లక్షల తగ్గింపు.. డిసెంబర్ 31 వరకు మాత్రమే

Mahindra Bolero: మహీంద్రా తన బొలెరో ఎస్ యూవీ పై డిసెంబర్‌లో ఇయర్ ఎండ్ సందర్భంగా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కంపెనీ మోడల్ ఇయర్ 2024 స్టాక్ క్లియరెన్స్ సేల్‌ను కూడా ఈ నెలలో తీసుకొచ్చింది. దీని కారణంగా తన కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ నెలలో బొలెరోను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే కంపెనీ మీకు రూ. 1.20 లక్షల విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.70 వేలు నగదు, రూ.30 వేల విలువైన యాక్ససరీస్, రూ.20 వేల విలువైన ఎక్సేంజ్ బోనస్ ఉన్నాయి. బొలెరో నియో ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 11.35 లక్షల నుండి రూ. 17.60 లక్షల వరకు ఉన్నాయి.

మహీంద్రా బొలెరో ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు

కొత్త మహీంద్రా బొలెరో నియో రూఫ్ స్కీ-రాక్, కొత్త ఫాగ్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ LED DRLలతో కూడిన హెడ్‌ల్యాంప్‌లు, డీప్ సిల్వర్ కలర్ స్కీమ్‌లో పూర్తి చేసిన స్పేర్ వీల్ కవర్ వంటి విజువల్ అప్‌గ్రేడ్‌లను పొందుతుంది. క్యాబిన్ కూడా డ్యూయల్ టోన్ లెదర్ సీట్లతో అప్‌గ్రేడ్ చేయబడింది. ఇది డ్రైవర్ సీటు అడ్జస్టబుల్ ఆఫ్షన్ కలిగి ఉంది. సెంటర్ కన్సోల్‌లో సిల్వర్ ఇన్‌సర్ట్‌లు ఉన్నాయి. మొదటి, రెండవ వరుస ప్రయాణీకులకు ఆర్మ్‌రెస్ట్ ఉంది.

దీని ఇంటీరియర్ గురించి చెప్పాలంటే, ఇది 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ యూనిట్‌లో Apple CarPlay, Android Auto అందుబాటులో లేవు. ఇది రివర్స్ పార్కింగ్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, మహీంద్రా బ్లూసెన్స్ కనెక్టివిటీ యాప్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్‌తో వస్తుంది. స్మార్ట్ స్టోరేజ్ స్పేస్ ఆప్షన్‌గా డ్రైవర్ సీటు కింద అండర్ సీట్ స్టోరేజ్ ట్రే కూడా ఉంది. వెనుక వైపున సైడ్-ఫేసింగ్ జంప్ సీట్లతో 7-సీట్ల ఆఫ్షన్ తో బొలేరో వస్తుంది.

ఈ ఎస్ యూవీలో ఎలాంటి మెకానికల్ మార్పులు కనిపించవు. ఈ మోడల్ 1.5-లీటర్ mHawk 100 డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 100bhp పవర్, 260Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో శక్తిని పొందుతుంది. సేఫ్టీ కోసం, ఈ మూడు-వరుసల ఎస్ యూవీ ట్విన్ ఎయిర్‌బ్యాగ్‌లు, క్రాష్ సెన్సార్‌లను కూడా కలిగి ఉంది.

Tags:    

Similar News