Tata Harrier EV: ఈవీ మార్కెట్‌లో టాటా సత్తా.. ఆ మోడల్ ఈవీ వెర్షన్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే..?
Tata Harrier EV: టాటా మోటార్స్ ఎస్‌యూవీ హారియర్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను ఇటీవల జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది.

Tata Harrier EV: ఈవీ మార్కెట్‌లో టాటా సత్తా.. ఆ మోడల్ ఈవీ వెర్షన్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే..?
Tata Harrier EV: టాటా మోటార్స్ ఎస్‌యూవీ హారియర్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను ఇటీవల జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో ప్రదర్శించింది. అప్పటి నుండి ఈ వెహికల్ కోసం కార్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈవీ సెగ్మెంట్‌లో ఇప్పటికే అత్యధిక సంఖ్యలో కార్లు ఉన్నాయి. మహీంద్రా, ఎంజీ, హ్యుందాయ్ కూడా ఈవీ విభాగంలో తమ పట్టును నిలుపుకొనేందుకుచేయడానికి కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. అయితే ఇప్పుడు టాటా కొత్త హ్యారియర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త మోడల్ గురించి పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
టాటా హారియర్ ఈవీలో 75 బ్యాటరీ ప్యాక్ ఉండొచ్చు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కారును ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు వెళుతుంది. హారియర్ వెహికల్-టు-లోడ్ (V2L), వెహికల్-టు-వెహికల్ (V2V) బై-డైరెక్షన్ ఛార్జింగ్ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 20 నుండి 22 లక్షల వరకు ఉండచ్చు. కానీ, టాటా మోటార్స్ నుండి బ్యాటరీ, రేంజ్ గురించి ఎటువంటి సమాచారం రాలేదు.
కొత్త హారియర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మార్చి నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కారును ప్రత్యేకమైన D8 ప్లాట్‌ఫామ్‌పై తయారుచేస్తున్నారు. హారియర్ ఎలక్ట్రిక్ డిజైన్‌లో కొత్తదనం కనిపిస్తుంది. స్పెషల్‌గా డిజైన్ చేసిన 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇందులో కనిపించబోతున్నాయి.
ఇందులో ఈవీలో పనోరమిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆటోకార్ ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలానే సేఫ్టీ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ అసిస్ట్, డ్రైవర్ వైపు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, మెమరీ ఫంక్షన్, ప్యాసింజర్ వైపు 4-వే పవర్ అడ్జస్ట్‌మెంట్ వంటి ఫీచర్లు చూడచ్చు.