Royal Enfield Shotgun 650 Launched: ఎన్‌ఫీల్డ్ 650 ఐకాన్ లిమిటెడ్ ఎడిషన్ .. 25 మందికే ఛాన్స్..!
Royal Enfield Shotgun 650 Launched: రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

Royal Enfield Shotgun 650 Launched: రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.25 లక్షలు. విశేషమేమిటంటే.. కంపెనీ ఈ బైక్‌ను ప్రపంచవ్యాప్తంగా 100 యూనిట్లు మాత్రమే విక్రయిస్తుంది. అందులో 25 బైక్‌లు మాత్రమే భారత్‌కి కేటాయించారు.
అంటే 25 మంది లక్కీ కస్టమర్లు మాత్రమే ఈ బైక్‌ను దక్కించుకోగలరు.ఈ బైక్ బుకింగ్ ఫిబ్రవరి 13న తెల్లవారుజామున 2 గంటలకు రాయల్ ఎన్‌ఫీల్డ్ యాప్‌లో ఓపెన్ అవుతుంది. మీరు అదృష్టవంతులైతే ఈ బైక్‌ను విజయవంతంగా బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త బైక్ ఇంజన్, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
ఈ రాయల్ ఎన్ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్ బైక్‌తో జాకెట్ కూడా అందిస్తున్నారు. ఈ బైక్‌లో రెడ్, వైట్, గోల్డ్ కలర్స్ కలయిక చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బైక్‌పై రేసింగ్ గ్రాఫిక్స్ కనిపిస్తాయి. బైక్ చక్రాలపై ఉన్న గోల్డ్ కలర్ ప్రత్యేక లుక్‌ను అందిస్తుంది. లిమిటెడ్ ఎడిషన్ సింగిల్ సీటర్ బైక్, ఇందులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డిస్క్ బ్రేక్‌లు, భద్రత కోసం పెద్ద టైర్లు ఉన్నాయి. ఈ బైక్‌తో పాటు గోల్డెన్ కలర్ హెల్మెట్ కూడా అందుబాటులో ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 బైక్‌లో 648cc పవర్ ఫుల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 47 Bhp పవర్, 52.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. బైక్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఈ ఇంజన్ చాలా శక్తివంతమైనది, ఎలాంటి వాతావరణంలోనైనా ఈ ఇంజన్ పనితీరు తగ్గదని కంపెనీ పేర్కొంది.