Maruti Swift Car: లక్ష చెల్లించి మారుతి స్విఫ్ట్ కారు తీసుకెళ్లండి.. మైలేజ్, ఫీచర్లు అద్భుతం..!
Maruti Swift Car: కొత్తకారు కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
Maruti Swift Car: కొత్తకారు కొనాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఒక లక్ష చెల్లించి మారుతి స్విఫ్ట్ కారు ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి స్విఫ్ట్ ఒకటి. గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది రెండో స్థానంలో నిలిచింది. ఈ కారు ధర రూ.6 లక్షల నుంచి రూ.9.03 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. అయితే దీని టాప్ మోడల్‌ను కొనుగోలు చేయడానికి చెల్లించాల్సిన నెలవారీ వాయిదా, ఇతర వివరాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
రూ.1 లక్షలో టాప్ మోడల్
మారుతి స్విఫ్ట్ టాప్ మోడల్ స్విఫ్ట్ ZXI ప్లస్ DT AMT. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.9.03 లక్షలు. అయితే ఆన్-రోడ్ ధర దాదాపు రూ.10 లక్షలు అవుతుంది. దాదాపు 10% డౌన్ పేమెంట్ (రూ. 1.02 లక్షలు) చెల్లించి కారును కొనుగోలు చేయవచ్చు. అయితే వేర్వేరు బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లను కలిగి ఉంటాయని గుర్తుంచుకోండి. 1 సంవత్సరం నుంచి 7 సంవత్సరాల మధ్య రుణ కాల వ్యవధి ఉంటుంది. బ్యాంక్ వడ్డీ రేటును 10%గా, రుణ కాల వ్యవధి 5 సంవత్సరాలుగా తీసుకోవచ్చు. ఈ పరిస్థితిలో నెలకు దాదాపు రూ.19,415 ఈఎంఐ చెల్లించాలి. 5 సంవత్సరాలలో మొత్తం రూ.9,17,998 అవుతుంది. అదనంగా రూ.2.46 లక్షలు చెల్లించవలసి ఉంటుంది.
ఇంజన్, ఫీచర్లు
మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్. 90PS, 113Nm ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది కాకుండా ఇంజన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది మైలేజీని పెంచడంలో సహాయపడుతుంది. పెట్రోల్ మోడ్‌లో కారు మైలేజ్ లీటరుకు 22 కిమీ అయితే CNG మోడ్‌లో కిలోమీటరుకు 30.90 కిమీ మైలేజ్ వస్తుంది. స్విఫ్ట్ 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, క్రూయిజ్ కంట్రోల్, ఆటో AC, LED DRLలతో కూడిన LED హెడ్‌లైట్‌లను కలిగి ఉంటుంది. మోడల్‌లను బట్టి ధరలు మారుతూ ఉంటాయి.