Ola Roadster: రూ.74,999కే ఓలా ఎలక్ట్రిక్ బైక్.. 194 కిమీ వేగంతో దూసుకుపోతుంది..!
Ola Roadster: ఓలా తన సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ రోడ్‌స్టర్ కాన్సెప్ట్‌ని విడుదల చేసింది. ఈ లైనప్‌లో మూడు బైకులు ఉన్నాయి.
Ola Roadster: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ డిమాండ్ ఉంది. వీటి ధరలు తక్కువగా ఉండటం వలన ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అలానే రోజురోజుకు పెరుగుతున్న పెట్రో భారం నుండి కూడా బయటపడొచ్చు. ఈ నేపథ్యంలో ఓలా తన సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ రోడ్‌స్టర్ కాన్సెప్ట్‌ని విడుదల చేసింది. ఈ లైనప్‌లో మూడు బైకులు ఉన్నాయి. వీటి బుకింగ్‌లను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. దీని డెలివరీ 2025 నుండి ప్రారంభమవుతుంది. దీని పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ బైక్ రోడ్‌స్టర్‌లో మూడు వేరియంట్‌లను విడుదల చేసింది. వీటిలో రోడ్‌స్టర్ ప్రో, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్ ఉన్నాయి. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో ఈ బైక్‌లు సరికొత్త విప్లవాన్ని తీసుకురాబోతున్నాయని కంపెనీ పేర్కొంది. రోడ్‌స్టర్ ప్రో టాప్ మోడల్ ధర 8kWh బ్యాటరీ రూ. 1,99,999, 16kWh బ్యాటరీ రూ. 2,49,999. ఈ బైక్ కేవలం 1.2 సెకన్లలో 0 నుండి 40 వరకు వేగాన్ని అందుకుంటుంది. టాప్ స్పీడ్ గంటకు 194 కిలోమీటర్లు. ఈ బైక్ ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 579 కిలోమీటర్లు నడుస్తుంది. 10అంగుళాల టచ్‌స్క్రీన్, ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని డెలివరీ దీపావళి నుండి ప్రారంభమవుతుంది.
రోడ్‌స్టర్ ధర 2.5kWh బ్యాటరీ రూ.1,04,999, 4.5kWh బ్యాటరీకి రూ.1,19,999, 6kWh బ్యాటరీ రూ.1,39,999గా ఉంటుంది. ఈ బైక్ 2.2 సెకన్లలో 0 నుండి 40కిమీ వేగాన్ని అందుకుటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 126 కిలోమీటర్లు. ఇది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 579 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇందులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి దీని డెలివరీ ప్రారంభమవుతుంది.
రోడ్‌స్టర్ దీని ధర 2.5kWh బ్యాటరీ కోసం రూ.74,999 నుండి ప్రారంభమవుతుంది. ఈ బైక్ 2.8 సెకన్లలో 0 నుండి 40 వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 124 కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు పరుగెత్తుతుంది. ఇందులో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, 4.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి దీని డెలివరీ కూడా ప్రారంభమవుతుంది.
ఇవి కాకుండా కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ MoveOS 5ని కూడా పరిచయం చేసింది. ఇది కాకుండా ఇప్పుడు గ్రూప్ నావిగేషన్ ఫీచర్ ఓలా మ్యాప్స్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. అలానే ఓలా స్కూటర్లలో AI ఆధారిత టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, క్రుట్రిమ్ AI అసిస్టెంట్ ఉంటాయి. ఈ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఎండీ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ నేడు భారత ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో మూడింట రెండు వంతుల వాటా బైక్‌లదే అన్నారు.
ఓలా ఈ విభాగంలోకి ప్రవేశించడం వల్ల భారతీయ ద్విచక్ర వాహనాల విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. భారతీయులు ఇప్పటికే స్కూటర్ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. మా భవిష్యత్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోతో మేము ఇప్పుడు మా మోటార్‌సైకిళ్ల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తిని పెంచడంపై దృష్టి సారించాము. వచ్చే ఏడాది ప్రారంభం నుండి భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ వాహనాలను పెద్దఎత్తున స్వీకరించేందుకు మార్గం సుగమం చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ బైక్‌లు భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తును మారుస్తాయని ఓలా పేర్కొంది.