Oben Electric: షోరూంలు షురూ.. త్వరలో 4 ఎలక్ట్రిక్ బైకులు.. రేంజ్‌లో తగ్గేదేలే..!

Oben Electric: ఓబెన్ ఎలక్ట్రిక్ త్వరలో నాలుగు కొత్త బైక్‌లను లాంచ్ చేయనుంది. అలానే కొత్త షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్‌ల సంఖ్యను పెంచనుంది.

Update: 2024-09-10 09:15 GMT

oben electric 

Oben Electric: దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దీని కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు తమ బైక్‌లు, స్కూటర్ల లైనప్‌ను కూడా విస్తరిస్తున్నారు. అలానే కొత్త షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్‌ల సంఖ్యను పెంచుతున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ కంపెనీ ఒబెన్ ఎలక్ట్రిక్ కూడా నాలుగు కొత్త బైక్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.ఒబెన్ ఎలక్ట్రిక్ తన వాహనాలను భారతీయ మార్కెట్లో పెద్ద ఎత్తున విక్రయించడానికి సిద్ధమవుతోంది.

రాబోయే నెలల్లో 4 కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో షోరూమ్‌లు కూడా ఓపెన్ చేయనుంది. ఒబెన్ ఎలక్ట్రిక్ ప్రకారం రాబోయే ఎలక్ట్రిక్ బైక్‌ల ధర రూ.60,000 నుండి రూ.1,50,000 వరకు ఉంటుంది. ప్రతి వర్గానికి చెందిన కస్టమర్‌లను చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.అందుకే అందరికి అందుబాటులో ఉండే రేంజ్‌లో బైక్‌లను విడుదల చేసేందుకు రెడీ అవుతుంది. 

కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో పాటు ఒబెన్ ఎలక్ట్రిక్ కూడా భారతదేశం అంతటా తన సేల్స్, సర్వీస్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఒబెన్ ఎలక్ట్రిక్ ఈ ఏడాది చివరి నాటికి 12కి పైగా ప్రధాన నగరాల్లో 60 కొత్త షోరూమ్‌లను ప్రారంభించనుంది.ప్రస్తుతం కంపెనీ లైనప్‌లో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ బైక్ ఒబెన్ రోర్. ఈ బైక్‌లు చాలా కాలంగా భారత మార్కెట్‌లో అమ్ముడవుతున్నాయి. దీని ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర విషయానికి వస్తే దీని అసలు ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఒబెన్ రోర్ నేక్డ్ స్పోర్ట్స్ బైక్ లాగా కనిపిస్తుంది. ఇది ఇంటిగ్రేటెడ్ LED DRL రింగ్‌తో రౌండ్ LED హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ 4.4 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది LFP (లిథియం ఫెర్రో ఫాస్ఫరస్) టెక్నాలజీతో వస్తుంది. దీని కారణంగా ఈ బ్యాటరీ బైక్‌ను సేఫ్‌గా ఉంచుతుంది.మీరు ఏదైనా 15 Amp సాకెట్ నుండి Oben Rorr బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. ఈ బ్యాటరీ 2 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.

ఈ బైక్ 187 కిమీల IDC రేంజ్ అందిస్తుంది. ఇందులో మీరు మూడు రైడింగ్ మోడ్‌లను చూడొచ్చు - ఎకో, సిటీ, హవోక్ (స్పోర్ట్). ఈ బైక్ వేగం ఎకో మోడ్‌లో 50 కిమీ వరకు, సిటీ మోడ్‌లో 70 కిమీ, హవోక్ మోడ్‌లో 100 కిమీ కంటే ఎక్కువ. మీరు ఒబెన్ రోర్ ముందు భాగంలో 37 mm టెలిస్కోపిక్ ఫోర్క్‌లను, వెనుక వైపున మోనోషాక్‌ను చూస్తారు. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో CEAT 110/70-17 (ముందు) మరియు 130/70-17 (వెనుక) టైర్లు అమర్చబడ్డాయి. ఇందులో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

Tags:    

Similar News