Maruti Swift: భారత్‌లో అత్యధికం అమ్ముడుపోయిన కారు ఏంటో తెలుసా.? మే నెలకు గాను.. !
Maruti Swift: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి ఇటీవల భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన కొత్త 2024 స్విఫ్ట్ రికార్డులు సృష్టిస్తోంది.
Maruti Swift: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి ఇటీవల భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన కొత్త 2024 స్విఫ్ట్ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా మే నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కారుగా మారుతి సుజుకి అవతరించింది. ఈ కారు మార్కెట్లోకి వచ్చిన తొలి నెలలోనే ఏకంగా 19,393 యూనిట్లు అమ్ముడయ్యి సరికొత్త చరిత్ర సృష్టించింది.
భారత మార్కెట్లోకి మారుతి స్విఫ్ట్ కారు మే 9వ తేదీన అమ్మకాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కారు బేస్ వేరియంట్ రూ. 6.49 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైజ్‌తో మొదలు కాగా, టాప్ ఎండ్ వేరియంట్ రూ. 9.5 లక్షలుగా ఉంది. ఇక స్విఫ్ట్ మునుపటి మోడల్ మాదిరిగానే కొత్త స్విఫ్ట్ ఏఎమ్‌టీ, మాన్వువల్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఈ కొత్త కారు వీఎక్స్‌ఐ వేరియంట్‌ను ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
కొత్త స్విఫ్ట్ మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ స్థానాన్ని దక్కించుకుంది. గతంలో మొదటి స్థానంలో నిలిచిన పంచ్ కారు ప్రస్తుతం 18,949 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇందులో కొత్త పంచ్ ఈవీ, ఐస్ వెర్షన్స్ ఉన్నాయి. మైలేజ్‌కు పెద్ద పీట వేసిన స్విఫ్ట్ వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకుంది. కొత్త స్విఫ్ట్ ఏకంగా లీటర్‌కు 25.75 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. గతంలో వచ్చిన మోడల్‌తో పోల్చితే ఇది చాలా ఎక్కువ కావడం విశేషం.
ఇక కొత్త స్విఫ్ట్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 3 సిలిండర్‌ను ఇంజన్‌ను అందించారు. ఇది గతంలో వచ్చిన కార్లతో పోల్చితే చాలా సమర్థవంతమైంది. కొత్త స్విఫ్ట్ కారు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా వ్యాగన్ ఆర్ కారును అధిగమించింది. ఇదిలా ఉంటే ఈ కారును మొత్తం ఐదు వేరియంట్‌లలో విడుదలైంది. కానీ దాని VXI, VXI (O) వేరియంట్‌లకు మార్కెట్‌లో అత్యధిక డిమాండ్ ఉంది. కొత్త ఇంజిన్ నుండి ఇది 60 kW పవర్, 111.7 న్యూటన్ మీటర్ల టార్క్ రిలీజ్ చేస్తుంది. దీనికి 5 స్పీడ్ మ్యాన్యువల్, AMT ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి. ఇక ఈ కారులో ఆరు స్పీకర్ సెటప్, ముందు భాగంలో తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్, సరికొత్త సస్పెన్షన్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, సుజుకి కనెక్ట్, హైడ్రాలిక్ క్లచ్, వెనుక ఏసీ వెంట్లు, వెనుక ప్రయాణీకులు తమ ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి రెండు ఛార్జింగ్ పోర్ట్‌లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్‌పై ఆడియో నియంత్రణలు కాకుండా, క్రూయిజ్ కంట్రోల్ అలాగే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.