Maruti eVX: మార్కెట్లోకి వచ్చిన మారుతీ సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు.. వాట్ ఏ ఫీచర్స్ ?

Maruti eVX : మారుతీ సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు సర్వం సిద్ధమైంది. తొలి ఎలక్ట్రిక్ కారు eVX నవంబర్ 4న లాంచ్ చేసింది.

Update: 2024-11-07 11:55 GMT

Maruti eVX: మార్కెట్లోకి వచ్చిన మారుతీ సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు.. వాట్ ఏ ఫీచర్స్ ?

Maruti eVX : మారుతీ సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు సర్వం సిద్ధమైంది. తొలి ఎలక్ట్రిక్ కారు eVX నవంబర్ 4న లాంచ్ చేసింది. ఇటలీలోని మిలాన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. సుజుకి కంపెనీకి ఈ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా ముఖ్యమైనది. భారతదేశంలో ఈ కారు టాటా మోటార్స్ , మహీంద్రా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీనిస్తుంది. మిలన్ నగరంలో విడుదల చేసిన మారుతి eVX కారు తుది ఉత్పత్తి వెర్షన్‌గా, ఈ మోడల్‌ను మార్కెట్లో విక్రయించనున్నారు. మేడ్-ఇన్-ఇండియా మారుతి eVXలో ఎక్కువ భాగం ఎగుమతి చేయబడుతుంది. భారతదేశంలో తయారు చేయబడిన ఈ ఎలక్ట్రిక్ SUV యూరప్, జపాన్ మార్కెట్లకు ఎగుమతి చేయబడుతుంది.

ఇది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 500 కి.మీ

మారుతి సుజుకి ఇవిఎక్స్ స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ అందిన సమాచారం ప్రకారం.. మారుతి కొత్త ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో అందించబడుతుంది. ఇది 48kWh, 60kWh అనే రెండు ఎంపికలను కలిగి ఉంటుంది. ఈ కారు ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 500 కి.మీల వరకు పరుగెత్తగలదని చెబుతున్నారు.

కారు ఫీచర్స్

ఈ కారులో ఫ్లోటింగ్ టైప్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్తగా డిజైన్ చేయబడిన డాష్ బోర్డ్, కంట్రోల్ స్విచ్‌లు, డ్రైవింగ్ మోడ్‌ల కోసం రోటరీ డయల్, లెదర్ సీట్లు ఉండవచ్చు. ఇది కాకుండా, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి.

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025

మారుతీ కొత్త ఎలక్ట్రిక్ కారు గుజరాత్‌లోని మారుతీ సుజుకి ప్లాంట్‌లో తయారు చేయబడుతుంది. ఈ పని 2025 సంవత్సరం నుండి ప్రారంభించవచ్చు. నవంబర్ 4న ఇటలీలో లాంచ్ జరిగింది. జనవరి 2025లో జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఈ కారును భారతదేశంలో ఆవిష్కరించనున్నట్లు తెలిసింది. ఇది ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ కార్లతో పాటు రాబోయే Tata Curvv EV, Creta EV ఎలక్ట్రిక్ కార్లతో పోటీపడుతుంది.

Tags:    

Similar News