Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్ MX1 బేస్ వేరియంట్.. స్టైలిష్ లుక్‌తో అదిరిపోయే ఫీచర్లు.. ఆ కార్లకు గట్టి పోటీ..!

Mahindra Thar Roxx: మహీంద్రా థార్ రాక్స్‌ని లాంచ్ చేసింది. దీని ఎంట్రీ-లెవల్ (MX1) పెట్రోల్ వేరియంట్ ధర రూ. 12.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Update: 2024-08-15 08:17 GMT

Mahindra Thar Roxx

Mahindra Thar Roxx: కార్ లవర్స్ ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న మహీంద్రా ఎట్టకేలకు తన థార్ రాక్స్‌ని విడుదల చేసింది. దీని ధరలను కంపెనీ ప్రకటించింది. ఇది 5 డోర్ వెర్షన్‌లో వస్తుంది. కొత్త థార్ రాక్స్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో విడుదలైంది. దీని ఎంట్రీ-లెవల్ (MX1) పెట్రోల్ వేరియంట్ ధర రూ. 12.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది, అయితే దీని ఎంట్రీ-లెవల్ డీజిల్ వేరియంట్ ధర రూ. 13.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. రాక్స్ ధరలు 3-డోర్ వేరియంట్ కంటే దాదాపు రూ. 1.64 లక్షలు ఎక్కువగా ఉంటుంది.

మహీంద్రా థార్ రాక్స్ MX1 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌‌ కలిగి ఉంటుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇవి 152hp పవర్, 330 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తాయి. ఇది కాకుండా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే 2.2 లీటర్ డీజిల్ ఇంజన్‌ను కూడా ఉంటుంది. మహీంద్రా థార్ రోక్స్ బేస్ మోడల్ MX1లో 18 అంగుళాల స్టీల్ వీల్స్‌తో సహా అనేక మంచి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా థార్ రాక్స్‌లో మీకు 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది కాకుండా పుష్ బటన్ స్టార్ట్, డ్రైవర్ సీటు అడ్జస్ట్‌మంట్ చేయవచ్చు. అలానే ఇది 60:40 స్ప్లిట్ రియర్ ఫోల్డింగ్ బెంచ్ సీటును కలిగి ఉంది. ఇందులో వెనుక ప్రయాణీకుల కోసం AC వెంట్, USB పోర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనితో మీరు మీ స్మార్ట్‌ఫోన్. ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేయవచ్చు.

ఈ వేరియంట్ పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లలో వస్తుంది. మహీంద్రా థార్ రాక్స్‌ MX1 వేరియంట్‌లో సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 3 పాయింట్ సీట్ బెల్ట్ ఉన్నాయి. కొత్త థార్ రోక్స్ డిజైన్ ప్రీమియం మాత్రమే కాదు, ఇది చాలా బోల్డ్, స్పోర్టీగా కూడా ఉంది. ఇప్పటికే ఉన్న 3 డోర్‌లతో పోలిస్తే దీని ముందు భాగంలో కొత్త గ్రిల్‌ ఉంటుంది. థార్ రాక్స్ మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైదర్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, ఎమ్‌జి ఆస్టర్ వంటి SUVలతో పోటీపడుతుంది.

Tags:    

Similar News