Kia Seltos Discounts: అమ్మకాలు పెంచేందుకు కియా భారీ స్కెచ్.. సెల్టోస్‌పై రూ.2లక్షల వరకు బెనిఫిట్స్
Kia Seltos Discounts: కియా ఇండియా (Kia India) ఈ నెలలో తన కార్లపై భారీ డిస్కౌంట్ల (Discounts) ను ప్రకటించింది. నవంబర్‌లో కంపెనీ తన ప్రసిద్ధ SUV సెల్టోస్ (Seltos) పై రూ. 2 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది.
Kia Seltos Discounts: కియా ఇండియా (Kia India) ఈ నెలలో తన కార్లపై భారీ డిస్కౌంట్ల (Discounts) ను ప్రకటించింది. నవంబర్‌లో తన ప్రసిద్ధ SUV సెల్టోస్ (Seltos) పై రూ. 2 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. గత ఏడాది కియా అమ్మకాలు బాగా తగ్గాయి. పండుగ సీజన్‌లో కూడా కస్టమర్లను ఆకర్షించడంలో కంపెనీ విఫలమైంది. ఇలాంటి పరిస్థితుల్లో సెల్టోస్ విక్రయాలను పెంచేందుకు కంపెనీ ఈ గొప్ప ఆఫర్‌ను తీసుకొచ్చింది. నవంబర్ 30 వరకు కస్టమర్లకు ఈ ఆఫర్ ఉంటుంది. ఆగస్టులో 6,536 యూనిట్లు, సెప్టెంబరులో 6,959 యూనిట్లు, అక్టోబర్‌లో 6,365 యూనిట్లు సెల్టోస్ అమ్ముడయ్యాయి.
కియా సెల్టోస్ (Kia Seltos) నవంబర్ ఆఫర్ గురించి మాట్లాడితే HTX iMT 1.5L డీజిల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 17,26,900, కానీ ఇప్పుడు దాని ఆఫర్ ధర రూ.15,33,346గా మారింది. అంటే మీరు దీనిపై రూ.1,93,554 లాభం పొందుతున్నారు. HTX ప్లస్ iMT 1.5T పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 18,72,900, కానీ ఇప్పుడు దాని ఆఫర్ ధర రూ.16,73,973గా మారింది. అంటే మీరు దీనిపై రూ.1,98,927 వరకు ఆదా చేసుకోవచ్చు.
HTX Plus iMT 1.5 డీజిల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 18,94,900, కానీ ఇప్పుడు దాని ఆఫర్ ధర రూ.16,95,163గా మారింది. అంటే మీరు దీనిపై రూ. 1,99,737 లాభం పొందుతారు. HTK ప్లస్ iMT 1.5 డీజిల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15,09,900, కానీ ఇప్పుడు దాని ఆఫర్ ధర రూ.13,22,676గా మారింది. అంటే మీరు దీనిపై రూ.1,87,224 ఆదా చేస్తారు.
Kia Seltos Specifications
కొత్త సెల్టోస్ గ్రావిటీ ఎడిషన్‌లో డాష్ కెమెరా, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, బోస్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌తో ఆటో హోల్డ్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, రియర్ స్పాయిలర్, గ్రావిటీ) ఉన్నాయి. బ్యాడ్జ్‌ల వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా ఈ కొత్త వేరియంట్ మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో గ్లేసియర్ వైట్ పెర్ల్, అరోరా బ్లాక్ పెర్ల్, డార్క్ గన్ మెటల్ మ్యాట్ ఫినిష్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి.
ఇంజిన్ పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే సెల్టోస్ గ్రావిటీని రెండు ఇంజన్ ఆప్షన్‌లతో ఎంచుకోవచ్చు. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల గురించి మాట్లాడితే పెట్రోల్ మోటారు 6-స్పీడ్ మాన్యువల్, iMT యూనిట్‌ను పొందుతుంది. దీని డీజిల్ ఇంజన్ ప్రత్యేకంగా మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.