Electric-3 Wheeler: హ్యుందాయ్ - టీవీఎస్ నుంచి ఎలక్ట్రిక్ త్రీ-వీలర్... లాంచ్ ఎప్పుడంటే?
Electric-3 Wheeler: హ్యుందాయ్ ఇండియా, TVS మోటార్ భారతదేశంలో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కింద, త్రీ-వీలర్‌ను TVS మోటార్స్ తయారు చేయగా దాని డిజైన్, ఇంజనీరింగ్ బాధ్యతలును హ్యుందాయ్ చూసుకుంటోంది. హ్యుందాయ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న చివరి-మైల్ మొబిలిటీ మార్కెట్లో తమ ప్రజెన్స్ చూపించాలనుకుంటోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి TVS తో భాగస్వామిగా ఉండటానికి చర్చలు జరుపుతోంది.
టీవీఎస్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్ కింద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను స్థానికంగా ఉత్పత్తి చేస్తోంది. హ్యుందాయ్ మైక్రో-మొబిలిటీ వెహికల్ ఆర్కిటెక్చర్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం TVSతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో క్రెటా EV, ఇతర చివరి-మైల్ మొబిలిటీ కాన్సెప్ట్‌లను ప్రదర్శించాలని హ్యుందాయ్ యోచిస్తోంది. టీవీఎస్ కూడా 2025 నాటికి సొంతంగా ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ భాగస్వామ్యం హ్యుందాయ్ తన యాప్-ఆధారిత ప్లాట్‌ఫామ్ Shucleను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయడానికి మార్గాన్ని సులభతరం చేసింది. Shucle అనేది హ్యుందాయ్ AI రీసెర్చ్ ల్యాబ్ అభివృద్ధి చేసిన డిమాండ్-రెస్పాన్సివ్ రైడ్-పూలింగ్ సర్వీస్. ఈ సర్వీస్ దక్షిణ కొరియాలోని సెజోంగ్ సిటీలో స్థానిక రవాణా సవాళ్లను రియల్ టైమ్ డిమాండ్, ఫ్లెక్సిబుల్ రూటింగ్ ద్వారా పరిష్కరిస్తుంది.
భారత్‌లో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. దేశంలో విక్రయించే ప్రతీ రెండవ మూడు చక్రాల వాహనాల శ్రేణిలో ఒక ఎలక్ట్రిక్ మోడల్ ఉంటోంది. జనవరి-నవంబర్ 2024 నాటికి, ఈ విభాగం 20% వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 631,855 యూనిట్లు విక్రయించింది. ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ రిక్షాలు, కార్గో డెలివరీ మోడల్స్ ఈ సెగ్మెంట్ ప్రధాన ఉత్పత్తులు.
హ్యుందాయ్, టీవీఎస్ మధ్య ఈ భాగస్వామ్యం భారతదేశ ఈవీ త్రీ-వీలర్ మార్కెట్‌కు కొత్త దిశను అందిస్తుంది. ఇది వినియోగదారులకు కొత్త, వినూత్నమైన ఛాయిస్‌లను అందించడమే కాకుండా, భారతదేశంలో మైక్రో-మొబిలిటీ సొల్యూషన్‌లను ప్రోత్సహించడానికి హ్యుందాయ్‌కి గొప్ప అవకాశంగా కూడా ఉంటుంది.