Mahindra XUV400 Stock Clear Deal: స్టాక్ క్లియరెన్స్ డీల్.. మహీంద్రా XUVపై రూ.3 లక్షల డిస్కౌంట్
Mahindra XUV400 Stock Clear Deal: కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఇప్పుడు అన్ని కార్ల కంపెనీలు తమ అమ్మకాలను పెంచడానికి మరోసారి ప్రయత్నిస్తున్నాయి. మీరు ఈ నెలలో కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు ఇదే మా శుభవార్త అంటోంది మహింద్రా. కొత్త సంవత్సరంలో కూడా మహీంద్రా వద్ద పాత కార్లు మిగిలి ఉన్నాయి. వీటిని క్లియర్ చేయడానికి కంపెనీ భారీ డిస్కౌంట్లను ఇస్తోంది.
ఈ నెలలో మహీంద్రా XUV400 EV కారు కొనేవారికి రూ. 3 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. మార్కెట్ వర్గాల వివరాల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ SUV స్టాక్ ఇంకా మిగిలే ఉంది. గతేడాది కూడా దీనిపై మంచి తగ్గింపు లభించింది. మీరు ఈ వాహనాన్ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ముందుగా దీని ధర, ఫీచర్లు, రేంజ్ గురించి తెలుసుకోండి.
Mahindra XUV400 EV Price And Offers - మహీంద్రా XUV400 EV కారు ధర, డిస్కౌంట్ ఆఫర్స్:
మహీంద్రా XUV400 EV ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.74 లక్షల నుండి ప్రారంభమవుతుంది. స్టాక్, తగ్గింపుల గురించి మరింత సమాచారం కోసం మీరు మీ సమీపంలోని మహీంద్రా డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. ఇప్పటివరకు ఈ SUV గురించి ఎటువంటి నెగిటివ్ పాయింట్లు బయటకురాలేదు.
మహీంద్రా 34.5kWh బ్యాటరీ వేరియంట్ 375 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. రెండవ బ్యాటరీ ప్యాక్ మోడల్ పూర్తి ఛార్జ్‌పై 456 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి.
ఈ SUVలో మీకు కూర్చోవడానికి సౌకర్యంగా, చాలా స్పేసియస్‌గా ఉంటుంది. ఐదుగురు వ్యక్తులు ఇందులో సులభంగా కూర్చోవచ్చు. ఇందులో స్థలం కొరత లేదు. ఇది నగరంలో, హైవేపై సాఫీగా సోగిపోతుంది. Tata Nexon ev కారుకు XUV 400 ఎలక్ట్రిక్ SUV కారుకు మధ్య గట్టి పోటీ ఉంది. ఈ రెండు వాహనాలు అమ్మకాలలో ఒకదానికొకటి పోటీపడుతున్నాయి.