Hyundai: స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్.. మెరుగైన భద్రతా ఫీచర్లు.. కొత్త వేరియంట్‌తో ఫిదా చేస్తోన్న హ్యుందాయ్ ఎక్సెటర్.. ధరెంతంటే?
రెండు కొత్త వేరియంట్లలో 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది సున్నితమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది.
Hyundai Exter SUV: హ్యుందాయ్ మోటార్స్ తన ఎంట్రీ-లెవల్ SUV హ్యుందాయ్ ఎక్సెటర్ రెండు కొత్త వేరియంట్‌లను విడుదల చేసింది. S+ (AMT) వేరియంట్ రూ. 7.86 లక్షలకు లభిస్తుండగా, S(O)+ (MT) వేరియంట్ రూ. 8.43 లక్షలకు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉంది. సాహసాలను ఇష్టపడే యువతను దృష్టిలో ఉంచుకుని ఈ వేరియంట్‌లు ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కొత్త మోడళ్ల అతిపెద్ద ఫీచర్ ఏంటంటే, స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్. ఇది ఈ SUVని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. వీటి ఫీచర్లు, ఇంజిన్ గురించి వివరంగా తెలుసుకుందాం..
రెండు కొత్త వేరియంట్లలో 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది సున్నితమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. అలాగే, ఈ ఇంజన్‌ని CNG ఇంజన్ ఆప్షన్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. నగరంలో ప్రయాణిస్తున్నా లేదా సుదూర ప్రయాణాలకు వెళ్లినా, ఈ ఇంజిన్ అన్ని పరిస్థితుల్లోనూ బలమైన పనితీరును అందిస్తుంది. హ్యుందాయ్ ఎక్సెటర్ ఈ వెర్షన్ సాంకేతికత, పనితీరు రెండింటిలోనూ ఉత్తమంగా ఉండాలనుకునే వినియోగదారుల కోసం తీసుకొచ్చింది.
స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కాకుండా, కొత్త S+ (AMT), S(O)+ (MT) వేరియంట్‌లలో మరిన్ని హైటెక్ ఫీచర్లు చేర్చింది. ఇది ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది Android Auto, Apple CarPlayకి మద్దతు ఇస్తుంది. అదనంగా, డిజిటల్ క్లస్టర్, కలర్ TFT మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు డ్రైవింగ్ అనుభవాన్ని జోడిస్తాయి.
ఇది కాకుండా, వెనుక AC వెంట్లు, అన్ని పవర్ విండోస్, LED డిస్ప్లే, ముందు, వెనుక స్కిడ్ ప్లేట్లు, హెడ్‌ల్యాంప్ ఎస్కార్ట్ ఫంక్షన్, ఫ్లోర్ మ్యాట్‌లు కూడా రెండు వేరియంట్‌లలో అందించింది.
భద్రత విషయంలో హ్యుందాయ్ ఎలాంటి రాజీ పడలేదు. ఈ కొత్త వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (హైలైన్) ఉన్నాయి. ఇది కాకుండా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM) వంటి అధునాతన సాంకేతికతలు కూడా అందించింది. ఇది డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా చేస్తుంది. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ESS) కూడా భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. హ్యుందాయ్ Xeter ఫీచర్లు, సాంకేతికతలో మాత్రమే కాకుండా బడ్జెట్ పరంగా కూడా గొప్ప ఎంపికగా నిలుస్తుంది.