Hyundai AURA Hy CNG E: హై సెక్యూర్ కార్.. అరా అప్‌డేటెడ్ వెర్షన్.. నంబర్ వన్ సెడాన్..!

Hyundai AURA Hy CNG E: హ్యుందాయ్ ఆరా కొత్త Hy-CNG E ట్రిమ్‌ను అప్‌గ్రేడ్ సేఫ్టీ ఫీచర్లతో లాంచ్ చేసింది. దీని ధర రూ. 7,48,600 (ఎక్స్-షోరూమ్.

Update: 2024-09-04 07:47 GMT

Hyundai AURA Hy CNG E: కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటర్స్‌కు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. కంపెనీకి చెందిన హ్యుందాయ్ వెర్నా, అల్కాజర్, టుక్సన్, అరా, ఐ10 నియోస్ వంటి చాలా మోడళ్లు సేల్స్ పరంగా దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ ఆరా కొత్త Hy-CNG E (Hyundai AURA Hy-CNG E) ట్రిమ్‌ను అప్‌గ్రేడ్ం ఫీచర్లతో లాంచ్ చేసింది. దీని ధర రూ. 7,48,600 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ మోడల్ CNG ఇంజన్‌తో పాటు పెట్రోల్ ఆప్షన్‌తో కూడా వస్తుంది.

Aura Hy-CNG E ట్రిమ్‌లో 1.2L డ్యూయల్-ఫ్యూయల్ పెట్రోల్ ఇంజన్‌తో CNG ఎంపికతో వస్తుంది. ఇది 6000rpm వద్ద 50.5 kW (69 PS) పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4,000 rpm వద్ద 95.2 Nm (9.7 kgm) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కిలోకి 28.4 కిమీ మైలేజీని అందిస్తుంది. ఈ కారును రోజువారీ అవసరాలకు, దూర ప్రయాణాలకు అనుగుణంగా డిజైన్ చేశారు.

హ్యుందాయ్ AURA Hy-CNG E వేరియంట్‌లో సేఫ్టీ ఫీచర్లను అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కారులో ప్రయాణీకులందరికీ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు ఉన్నాయి. ఈ కారు అన్ని ఆటోమోటివ్ సేఫ్టీ రెగ్యులేషన్‌కి అనుగుణంగా ఉంటుంది. హ్యుందాయ్ ఆరా హై-సిఎన్‌జి ఇ ట్రిమ్ సేఫ్టీ ఫీచర్ల గురించి మాట్లాడితే.. ముందు పవర్ విండో, టాప్ ఎండ్ అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీట్లను కలిగి ఉంది.

వీటిని మీరు మీ సౌకర్యానికి అనుగుణంగా సెట్ చేసుకోవచ్చు. ఇది వెనుక ప్రయాణీకుల సర్దుబాటు హెడ్‌రెస్ట్‌ను కలిగి ఉంది. దీనిలో 3.5 అంగుళాల మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే కూడి ఉంది. హ్యుందాయ్ ఆరా హై-సిఎన్‌జి ఇ ట్రిమ్ డిజైన్ పాత మోడల్‌ను పోలి ఉంటుంది. ఇది Z-సైజ్ LED టెయిల్ ల్యాంప్‌ని కలిగి ఉంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) ప్రారంభించినప్పటి నుండి 2,00,000 యూనిట్లకు పైగా ఆరాను విక్రయించింది. ఇది దాని ప్రజాదరణ, విశ్వసనీయతకు నిదర్శనం.

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ హోల్ టైమ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. హ్యుందాయ్‌లో మా కస్టమర్ల అవసరాలకు ఉత్తమంగా సరిపోయే ఉత్పత్తులను ఆవిష్కరించడానికి, అందించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. ప్రారంభించినప్పటి నుండి 200,000 యూనిట్లు అమ్ముడవడంతో హ్యుందాయ్ AURA ప్రపంచంలోని అత్యుత్తమ సెడాన్‌లలో ఒకటిగా మారింది.

Tags:    

Similar News