Hexa Flying Car: వచ్చేస్తోంది గాలిలో ఎగిరే కార్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టొచ్చంటోన్న నెటిజన్స్..!

Hexa Flying Car: గాలిలో ఎగిరే కార్ల గురించి చాలా కాలంగా మాట్లాడుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు ఈ దిశగా పనిచేస్తున్నాయి.

Update: 2024-05-23 11:30 GMT

Hexa Flying Car: వచ్చేస్తోంది గాలిలో ఎగిరే కార్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టొచ్చంటోన్న నెటిజన్స్..!

Hexa Flying Car: గాలిలో ఎగిరే కార్ల గురించి చాలా కాలంగా మాట్లాడుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు ఈ దిశగా పనిచేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం భారతదేశంలో కూడా ఫ్లయింగ్ టాక్సీ సేవలను ప్రారంభించాలనే చర్చ జరిగింది.

ప్రస్తుతం టోక్యోలో జరుగుతున్న ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఈవెంట్ సందర్భంగా హెక్సా ఎగిరే కారు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కారు గాలిలో ఎగురుతున్నట్లు చూపించారు.

ఈ ఎగిరే కారు టోక్యో బిగ్ సైట్ కన్వెన్షన్ సెంటర్ క్యాంపస్‌లో వందలాది మంది ప్రజల ముందు భూమి నుంచి సుమారు 10 మీటర్లు (సుమారు 32 అడుగులు) ఎగిరింది.

ఈ ఎలక్ట్రిక్ ఎగిరే కారును అమెరికన్ కంపెనీ లిఫ్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంక్ తయారు చేసింది. ఇందులో 18 ప్రొపెల్లర్లు, ఒక వ్యక్తికి మాత్రమే సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి.

ఇది డ్రోన్‌కు మరో వెర్షన్. ఇది 4.5 మీటర్ల వెడల్పు, 2.6 మీటర్ల ఎత్తు. దీని మొత్తం బరువు 196 కిలోలుగా ఉంది.

ఈ కారును మరోసారి డెమో చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. వచ్చే శని, బుధ, గురువారాల్లో మూడు రోజుల పాటు ప్రతిరోజూ 15 నిమిషాల సెషన్ నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

తొలి విమాన ప్రయాణం సందర్భంగా టోక్యో గవర్నర్ యురికో కోయికే మాట్లాడుతూ, ఈ అత్యాధునిక సాంకేతికతను మరింత మంది ప్రజలు అనుభవించాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

"ఎగిరే కార్లను ఒక సాధారణ రవాణా సాధనంగా మార్చడానికి నేను ఆసక్తిగా ఉన్నాను, తద్వారా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది" అంటూ తెలిపాడు. వాస్తవానికి, దేశంలో వీలైనంత త్వరగా ఎగిరే కార్ల కార్యకలాపాలను ప్రారంభించేందుకు జపాన్ సిద్ధమవుతోంది. సుజుకీ, స్కైడ్రైవ్ వంటి మరికొన్ని కంపెనీలు కూడా దీని కోసం ప్రయత్నిస్తున్నాయి.

Tags:    

Similar News