Maruti Suzuki: లీటర్‌కు 32 కిమీల మైలేజీ.. కళ్లు చెదిరే ఫీచర్లు.. పెండింగ్‌లో 11వేల ఆర్డర్స్ అయినా, తగ్గేదేలే అంటోన్న జనాలు..!

Maruti Suzuki: మారుతి వ్యాగన్ R హ్యాచ్‌బ్యాక్ కంపెనీ లైనప్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా నిలిచింది. పెట్రోల్, CNG వెర్షన్‌లను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు.

Update: 2024-05-17 14:30 GMT

Maruti Suzuki: లీటర్‌కు 32 కిమీల మైలేజీ.. కళ్లు చెదిరే ఫీచర్లు.. పెండింగ్‌లో 11వేల ఆర్డర్స్ అయినా, తగ్గేదేలే అంటోన్న జనాలు..!

Maruti Suzuki: మారుతి వ్యాగన్ R హ్యాచ్‌బ్యాక్ కంపెనీ లైనప్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా నిలిచింది. పెట్రోల్, CNG వెర్షన్‌లను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. గత నెలలో అంటే ఏప్రిల్ 2024లో 17,850 యూనిట్లను విక్రయించింది. వ్యాగన్ ఆర్‌కి ఇంత ఎక్కువ డిమాండ్ ఉన్నందున, ఈ కారును సరఫరా చేయడంలో కంపెనీకి అతిపెద్ద భారం ఎదుర్కొంటోంది. ప్రస్తుతం కంపెనీ వ్యాగన్ ఆర్‌కే 11,000 యూనిట్ల సీఎన్‌జీ వెర్షన్లు పెండింగ్‌లో ఉందనే సమాచారం వెలుగులోకి వచ్చింది. కంపెనీ ప్రతి నెలా 16,000 యూనిట్లను పంపుతోందంట. అంటే, ఈ లెక్కలతో మారుతి వ్యాగన్ ఆర్ నెంబర్ వన్‌గా ఎందుకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

2.2 లక్షల కార్లు రోడ్లపై తిరుగుతున్నాయ్..

ఒక నివేదిక ప్రకారం, మారుతి ప్రస్తుతం 2.2 లక్షల యూనిట్లను కలిగి ఉంది. వాటిలో 1.1 లక్షల యూనిట్లు CNG వాహనాలు కావడం గమనార్హం. వీటిలో అత్యధికంగా ఎర్టిగా 60,000 యూనిట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఎమ్‌పీవీకి ఉన్న భారీ డిమాండ్‌ను తీర్చడానికి కార్‌మేకర్ ఇటీవల తన మానేసర్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష యూనిట్లకు విస్తరించింది.

వ్యాగన్ R CNG స్పెసిఫికేషన్స్..

వ్యాగన్ R CNG మారుతి 1.0-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది CNG మోడ్‌లో 56bhp పవర్, 82Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. CNG వెర్షన్‌లో, ఈ కారు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. దాని పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం 28 లీటర్లు, CNG ట్యాంక్ సామర్థ్యం 60 లీటర్లు. వ్యాగన్ ఆర్ సీఎన్‌జీలో లీటరుకు 34.05 కిమీ మైలేజీని కంపెనీ పేర్కొంది.

Tags:    

Similar News