Bike Riding Tips: చలికాలంలో బైక్‌ నడిపితే పొరపాటున ఈ తప్పులు చేయవద్దు..!

Bike Riding Tips: భారతదేశంలో చాలామంది టూవీలర్స్‌పై మాత్రమే ఆధారపడుతారు. ఎందుకంటే దీనిపై బడ్జెట్‌లో ప్రయాణం ముగుస్తుంది.

Update: 2024-02-01 15:30 GMT

Bike Riding Tips: చలికాలంలో బైక్‌ నడిపితే పొరపాటున ఈ తప్పులు చేయవద్దు..!

Bike Riding Tips: భారతదేశంలో చాలామంది టూవీలర్స్‌పై మాత్రమే ఆధారపడుతారు. ఎందుకంటే దీనిపై బడ్జెట్‌లో ప్రయాణం ముగుస్తుంది. అంతేకాదు చాలా సమయాల్లో సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే చలికాలంలో బైక్‌ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు జరిగినా పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం నెలకొంది. ఈ పరిస్థితిలో బైక్‌ నడిపేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

హెల్మెట్ లేకుండా బయటకు వెళ్లవద్దు

వాతావరణం ఎలా ఉన్నా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపవద్దు. వింటర్ సీజన్‌లో హెల్మెట్ లేకుండా రైడింగ్ చేయడం వల్ల ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండవది చలి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.

దుస్తులు ధరించడంలో నిర్లక్ష్యం వద్దు

బైక్ రైడింగ్ చేసే వ్యక్తులు కొన్నిసార్లు స్టైలిష్‌గా కనిపించడానికి సరైన బట్టలు ధరించరు. శీతాకాలంలో ఇది చాలా హానికరం. రోజువారీ దినచర్యలో బైక్‌ను ఉపయోగిస్తుంటే కచ్చితంగా సరైన దుస్తులను ధరించాలి.

బైక్‌ లైట్లు సరిగ్గా ఉన్నాయో చూసుకోవాలి

ఈ సీజన్‌లో హెడ్‌లైట్లు, బ్యాక్ లైట్లు, టర్న్ ఇండికేటర్‌లతో సహా అన్ని లైట్లు కండీషన్‌లో ఉండాలి. ఎందుకంటే రాత్రిపూట బైక్‌ నడిపేటప్పుడు పొగమంచు ఉంటుంది కాబట్టి లైట్లు చాలా చాలా ఉపయోగపడుతాయి. దీని వల్ల ముందున్న మార్గం మీ వెనుక నడిచే వ్యక్తి పరిస్థితి గురించి మీకు తెలుస్తుంది.

బ్రేక్‌లు, టైర్లు బాగుండాలి

చలికాలంలో మంచు వల్ల రోడ్లు తడిసిపోయి బైక్ జారిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల, టైర్లు కండీషన్‌లో ఉండేవిధంగా చూసుకోవాలి. తద్వారా రోడ్డుపై జారిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బ్రేకులు మంచి స్థితిలో ఉంట ద్విచక్ర వాహనాన్ని తొందరగా కంట్రోల్‌ చేయవచ్చు.

Tags:    

Similar News