Buy New Car: కొత్త కారు కొనడానికి డిసెంబర్ బెస్ట్.. ఎందుకంటే..?
Buy New Car: డిసెంబర్‌లో కొత్త కారు కొనడం సరైనదేనా.. ఈ విషయం గురించి పెద్ద చర్చ జరుగుతోంది.
Buy New Car: డిసెంబర్‌లో కొత్త కారు కొనడం సరైనదేనా.. ఈ విషయం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. వాస్తవానికి డిసెంబర్‌లో కార్ల కంపెనీలు సరసమైన ఆఫర్లు, డిస్కౌంట్లని ప్రకటిస్తాయి. దీనివల్ల చాలామంది కొత్త కార్లు కొనడానికి ముందుకువస్తారు. కానీ మరికొంతమంది జనవరిలో వచ్చే కొత్త మోడల్ కోసం ఎదురుచూస్తారు. ఇటీవలి కాలంలో సెమీకండక్టర్ చిప్, ఉత్పత్తికి సంబంధించిన ఇబ్బందులు తగ్గాయి. అయినప్పటికీ చాలా కంపెనీలలో వెయిటింగ్ పీరియడ్‌లు ఎక్కువగా ఉంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ700, మహీంద్రా థార్, హ్యుందాయ్ క్రెటా, మారుతీ ఎర్టిగా సిఎన్‌జి, టయోటా హైర్డర్ ఈ కార్లన్నింటికీ వెయిటింగ్ పీరియడ్ 10 నుంచి 11 నెలలుగా ఉంది. కాబట్టి మీకు నచ్చిన కారును త్వరగా పొందాలనుకుంటే వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కువ కాలం వేచి ఉండటం, కార్ల కొరత కారణంగా కస్టమర్‌లు వీలైనంత త్వరగా కారు కొనాలని అనుకుంటున్నారు. ఈ కారణంగానే కంపెనీలు కార్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు వారి రెండో ఎంపిక లేదా మూడో ఎంపిక అయిన కార్లను కొనుగోలు చేయాలి.
సాధారణంగా డిసెంబర్‌లో తయారీదారులు, డీలర్‌షిప్‌లు తమ ఇన్వెంటరీని క్లియర్ చేయాలి. కానీ పరిస్థితులు మారాయి. అమ్ముడుపోని కార్లు లేదా SUVల సంఖ్య సాధారణం కంటే తక్కువగా ఉన్నందున డీలర్‌షిప్‌లు అంత ఒత్తిడికి గురికావు. చాలా కంపెనీలు సాధారణంగా కొత్త సంవత్సరానికి ధరల పెంపును ప్రకటిస్తాయి. మోడల్ సంవత్సరాన్ని మార్చడం అంటే వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కొంత అదనపు డబ్బు అవసరమవుతుంది. ఈసారి కూడా ఇన్‌పుట్ కాస్ట్ పెరగడం వల్లే ధరల్లో మార్పు అవసరమని కంపెనీలు చెబుతున్నాయి.