BYD EMax 7: ఒక్క ఛార్జ్‌తో 530 కిమీ మైలేజ్.. దూసుకొస్తున్న బీవైడీ కొత్త కార్.. ఇందులో ఏడుగురు వెళ్లొచ్చు..!

BYD EMax 7: బీవైడీ EMax 7 లాంచ్ చేయనుంది. ఇది సెవన్ సీటర్ ఫ్యామిలీ కారు. ఫుల్ ఛార్జ్‌పై 530 కిమీ రేంజ్ ఇస్తుంది.

Update: 2024-09-13 09:49 GMT

BYD EMax 7

BYD EMax7: బీవైడీ భారతీయ కార్ మార్కెట్‌లో తన స్థానాన్ని సంపాదించుకోవడంలో క్రమంగా విజయం సాధిస్తోంది. కంపెనీ ఇప్పుడు ఫ్యామిలీ క్లాస్‌ను టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది పండుగ సీజన్‌లో తన కొత్త ఎమ్‌పివిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త మోడల్ పేరు BYD EMax7. ఇది సింగిల్ ఛార్జ్‌పై 530 కిమీ మైలేజ్ ఇస్తుంది. కారులో ఏడుగురు కూర్చోవచ్చు. అలానే సేఫ్టీ ఫీచర్లలోనూ రాజీపడలేదు. ఈ నేపథ్యంలో దీని ధర, ఫీచర్లు, తదితర వివరాలు తెలుసుకుందాం.

BYD EMax7 మోడల్ ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి భారతీయ రోడ్లపై పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఇది హై రేంజ్‌తో వచ్చే ఎలక్ట్రిక్ మోడల్ కారు. క్లాస్‌లో చాలా బెస్ట్ ఫీచర్‌లను ఇందులో చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. కొత్త BYD EMax7 ఎలక్ట్రిక్ MPV 71.8 kWh బ్యాటరీ ప్యాక్‌‌తో వస్తంది. నివేదికల ప్రకారం ఈ కారు ఫుల్ ఛార్జింగ్ పై 530 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

ఈ కారు గంటకు 0-100 కిమీ వేగాన్ని అందుకోవడానికి 8.6 సెకన్లు పడుతుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కారు. కొత్త మోడల్ 6-7 సీట్ల వేరియంట్లలో రానుంది. ఈ కొత్త మోడల్ టయోటా ఇన్నోవా హైక్రాస్‌తో నేరుగా పోటీపడుతుంది. కొత్త BYD EMax7 ధర దాదాపు రూ. 28-30 లక్షల వరకు పెరగవచ్చని అంచనా.అయితే ప్రస్తుతం చైనీస్ ఆటోమేకర్ ప్యాసింజర్ వెహికల్ (PV) స్థలంలో అటో 3 SUV, సీల్ సెడాన్ రూపంలో రెండు ఆఫర్లను కలిగి ఉంది. ఎమ్‌పివి మొత్తం డిజైన్ అదే విధంగా ఉన్నప్పటికీ రీవర్క్ చేయబడిన అవుట్ లుక్‌తో వస్తుంది.

కొత్త BYD eMax 7లో 7 మందికి సీటింగ్ ఉంటుంది. ఇది 3వ వరుసతో వస్తుంది. అధునాతన ఫీచర్లను ఇందులో చూడొచ్చు. భద్రత కోసం ఇది EBDతో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటో హోల్డ్, బ్రేక్ అసిస్ట్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 12.8 అంగుళాల తిరిగే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, LED హెడ్‌లైట్‌లతో టైల్‌లైట్లు, ఫాలో మీ ల్యాంప్స్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్. స్టార్ట్/స్టాప్ బటన్, ఆటో ఏసీ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో కుటుంబ తరగతి లక్ష్యంగా అనేక కంపెనీలు పోటీపడుతున్నాయి. 

Tags:    

Similar News