Best Budget Bikes 2024: మార్కెట్‌ను ఊపేస్తున్న బైక్స్ ఇవే.. తక్కువ ధరలో మంచి మైలేజ్..!
Best Budget Bikes 2024: లక్ష రూపాయల బడ్జెట్‌లో ఈ మూడు బైకులు లీటర్‌కు 60 కిమి మైలేజ్‌ని అందిస్తాయి.
Best Budget Bikes 2024: దేశంలో మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా నివశిస్తుంటారు. వారి ప్రాథమిక అవసరాలలో బైక్ కూడా ఒకటి. ఆఫీసుకు వెళ్లడం నుంచి పిల్లలను స్కూల్‌కి దింపడం వరకు ప్రతి చిన్న, పెద్ద పనిని పూర్తి చేయడంలో బైక్‌దే కీలకపాత్ర. కొందరి జీవనధారం బైక్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లను కొనుగోలు చేయడానికి ఇంటరెస్ట్ చూపుతారు. మీరు కూడా రోజూ అవసరాలకు కొత్త బైక్ కొనుగోలు చేయాలనుకుంటే లక్ష రూపాయల్లోపు లభించే బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Hero Glamour (హీరో గ్లామర్)
హీరో గ్లామర్ ధర రూ. 84,548 నుంచి రూ. 88,548 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది 125 cc పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది గరిష్టంగా 10.83 PS పవర్‌ని 10.6 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. హీరో గ్లామర్ లీటరుకు 55 కి.మీల మైలేజీని ఇస్తుంది. గ్లామర్ మోటార్‌సైకిల్‌లో ఫుల్ డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, గేర్ పొజిషన్ ఇండికేటర్, LED హెడ్‌లైట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఇది డ్రమ్, డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఇది స్పోర్ట్స్ రెడ్, టోర్నాడో గ్రేతో సహా అనేక రంగులలో అందుబాటులో ఉంది.
TVS Raider 125 (టీవీఎస్ రైడర్ 125)
టీవీఎస్ రైడర్ 125 బైక్ గురించి మాట్లాడితే దీని ధర రూ. 98 వేల నుండి రూ. 1.09 లక్షల మధ్య ఉంటుంది (ఎక్స్-షోరూమ్). ఇది 124.8 cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 11.38 PS పవర్, 11.2 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ కలదు. ఇది లీటరుకు 67 కి.మీల వరకు మైలేజీని ఇస్తుంది. కొత్త రైడర్ 125 మోటార్‌సైకిల్‌లో LED హెడ్‌లైట్, LED టెయిల్ లైట్, హాలోజన్ ఇండికేటర్లు, USB ఛార్జింగ్ పోర్ట్ మరియు LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా భద్రత కోసం TVS రైడర్ 125 డిస్క్/డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది. ఇందులో మీరు 10 లీటర్ల కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్‌ని పొందుతారు. ఈ బైక్ డిజైన్ కూడా స్పోర్టివ్‌గా ఉంటుంది.
Honda Livo (హోండా లివో)
హోండా లివో బైక్ ధర రూ. 79,950 నుండి రూ. 83,950 (ఎక్స్-షోరూమ్). ఇది 109.51 cc ఎయిర్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది గరిష్టంగా 8.79 PS పవర్, 9.30 Nm పీక్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇందులో 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉంది. ఈ బైక్ లీటరుకు 60 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. దీనిలో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఇంజన్ స్టార్ట్/స్టాప్ స్విచ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం డిస్క్ డ్రమ్ బ్రేక్‌లు అందించబడ్డాయి. ఇది బ్లాక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, మ్యాట్ క్రస్ట్ మెటాలిక్ కలర్స్‌లో లభిస్తుంది.