BMW G 310R: 8 సెకన్లలో 100 Kmph వేగం.. 35 Kmplల మైలేజ్.. రూ. 3 లక్షలకే ఈ BMW వెహికిల్‌ను ఇంటికి తెచ్చుకోండి..!

BMW G 310R: ఆటోమొబైల్ రంగంలో ప్రీమియం వాహనాల గురించి మాట్లాడినప్పుడల్లా, ఎక్కువగా వినిపించే పేరు BMW. ఇక కార్ల గురించి మాట్లాడితే బీఎమ్‌డబ్ల్యూ కార్లు లక్షల రూపాయల నుంచి మొదలై కోట్ల వరకు ఉంటాయి.

Update: 2023-12-30 14:30 GMT

BMW G 310R: 8 సెకన్లలో 100 Kmph వేగం.. 35 Kmplల మైలేజ్.. రూ. 3 లక్షలకే ఈ BMW వెహికిల్‌ను ఇంటికి తెచ్చుకోండి..!

BMW G 310R: ఆటోమొబైల్ రంగంలో ప్రీమియం వాహనాల గురించి మాట్లాడినప్పుడల్లా, ఎక్కువగా వినిపించే పేరు BMW. ఇక కార్ల గురించి మాట్లాడితే బీఎమ్‌డబ్ల్యూ కార్లు లక్షల రూపాయల నుంచి మొదలై కోట్ల వరకు ఉంటాయి. అదే సమయంలో, BMW దాని సూపర్ బైక్‌లకు కూడా ప్రసిద్ధి చెందింది. దీని ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కంపెనీకి చెందిన ఓ కారును మీకోసం పూర్తి వివరాలతో అందిస్తున్నాం. ఈ కార్‌ను కేవలం రూ. 3 లక్షలకే మీ సొంతం చేసుకోవచ్చన్నమాట. దీని పనితీరు, లుక్స్, మైలేజీ కూడా మీరు నమ్మలేని విధంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

BMW G 310 R బైక్ గురించి చెప్పబోతున్నాం. ఈ మోటార్‌సైకిల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.90 లక్షలుగా నిలిచింది. మోటార్‌సైకిల్ KTM 390 డ్యూక్, RE ఇంటర్‌సెప్టర్, హోండా CB300 వంటి బైక్‌లతో నేరుగా పోటీపడుతుంది.

శక్తివంతమైన ఇంజిన్..

బీఎమ్‌డబ్ల్యూ జీ 310 ఆర్‌లో కంపెనీ 313 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్ 34 బీహెచ్‌పీ పవర్, 28 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మీరు బైక్‌లో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ని పొందుతారు. బైక్ ట్యాంక్ కెపాసిటీ గురించి చెప్పాలంటే, ఇది 11 లీటర్లు. మోటార్‌సైకిల్‌లోని ప్రత్యేకత ఏమిటంటే దీని ఇంజన్ కేవలం 8.01 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. బైక్ కర్బ్ వెయిట్ 158.5 కిలోలు.

అదిరిపోయే లుక్స్..

బైక్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంది. ఇందులో మీకు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించారు. మీరు బైక్‌లో 41 mm USD టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్‌ను పొందుతారు. వెనుకవైపు ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. బైక్‌కు డ్యూయల్ ఛానల్ ABS అందించారు. మీరు ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లను కూడా పొందుతారు. బైక్‌లో ముందువైపు 300ఎమ్ఎమ్ సింగిల్ డిస్క్ బ్రేక్, వెనుకవైపు 240ఎమ్ఎమ్ సింగిల్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి.

ఫీచర్లు..

ప్రీమియం బైక్‌లో, మీకు LED DRL, టర్న్ ఇండికేటర్‌లతో కూడిన అన్ని LED లైటింగ్, రైడ్ బై వైర్ థొరెటల్, స్లిప్పర్ క్లచ్, అడ్జస్టబుల్ బ్రేక్‌లు, క్లచ్ లివర్‌లు అందించారు. అదే సమయంలో, మీకు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, BMW Motorrad ABS డిజిటల్ స్పీడోమీటర్, ట్రిప్‌మీటర్, పాస్ స్విచ్, ఇంజిన్ కిల్ స్విచ్ కూడా అందించారు.

Tags:    

Similar News