Bajaj Chetak Blue 3202: ఛార్జింగ్ పెట్టే టెన్షన్ లేదు.. బజాజ్ నుంచి బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. నడుస్తూనే ఉంటుంది..!
Bajaj Chetak Blue 3202: బజాజ్ చీపెస్ట్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లూ 3202 వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 137 కిమీ రేంజ్ ఇస్తుంది.
Bajaj Chetak Blue 3202: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఈవీ ద్విచక్ర వాహనాల రంగం గత కొన్ని సంవత్సరాలుగా దూసుకుపోతుంది. కంపెనీలు కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త వేరియంట్లను తీసుకొస్తున్నాయి. అలానే కొనుగోలుదారులకు కొత్త ఆఫర్లను అందిస్తున్నాయి. స్కూటర్లు గతంలో కంటే ఇప్పుడు మరింత సరసమైనవిగా మారుతున్నాయి.
బజాజ్ తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో సరికొత్త బ్లూ 3202 వేరియంట్‌ను చేర్చింది. ఇప్పుడు ఇది చాలా తక్కువ ధరకే బడ్జెట్ ప్రైస్‌లో లభిస్తుంది. ఈ స్కూటర్ ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది. అయితే చేతక్ ఫిక్సిడ్ బ్యాటరీతో వస్తుంది. దీన్ని తీయలేము, మార్చలేము. త్వరలో అటువంటి మోడల్ కూడా మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
బజాజ్ చేతక్ బ్లూ 3202 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.15 లక్షలుగా ఉంది. మునుపటి అర్బన్ వేరియంట్ ధర రూ. 1.23 లక్షలు. అంటే ఈ కొత్త వేరియంట్ ధర రూ. 8,000 తగ్గింది. దీని రేంజ్ 126 కిమీ నుండి 137 కిమీకి పెరిగింది. బజాజ్ ఆటో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీలో కొత్త సెల్స్‌ని ఇన్‌స్టాల్ చేసింది. ఇది బ్యాటరీ కెపాసిటీని మార్చకుండా మరింత రేంజ్ ఇస్తుందని పేర్కొంది.
చేతక్ బ్లూ 3202 650W ఛార్జర్ సహాయంతో పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5.50 గంటలు పడుతుంది. ఈ స్కూటర్‌లో కీ-లెస్ ఇగ్నిషన్ ఫీచర్ ఉంది. ఇది కూడా ప్లస్ పాయింట్. ఇది పెద్ద కలర్ LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, స్పోర్ట్స్ మోడ్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 73కిమీ. మీరు ఈ స్కూటర్‌ను బ్లూ, వైట్, బ్లాక్, గ్రే అనే 4 కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయగలుగుతారు.
బజాజ్ ఆటో ఆగస్టులో చేతక్ 3201 పేరుతో కొత్త ఎడిషన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.30 లక్షలుగా ఉంది. ఈ స్కూటర్‌ని ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ చేస్తే 136 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇందులో చాలా మంచి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, కలర్ TFT డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ ఉపయోగం కోసం ఇది మంచి స్కూటర్.