EV Car: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీల నాన్‌స్టాప్ జర్నీ.. అదిరిపోయే స్మార్ట్ ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి..!
MG Comet EV: కంపెనీ ఈరోజు భారత మార్కెట్‌లో MG కామెట్ EVని పరిచయం చేయనుంది. రెండు డోర్లు మరియు నాలుగు సీట్లతో వస్తున్న ఈ కారు కంపెనీ వాహన పోర్ట్‌ఫోలియోలో భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా నిలవనుంది.
MG Comet EV: ఎలక్ట్రిక్ కార్ల పట్ల క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. వాహన తయారీదారులు కూడా ఈ విభాగంలో తమ కొత్త మోడళ్లను ఎక్కువగా పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మోరిస్ గ్యారేజెస్ (MG మోటార్స్) తన కొత్త ఎలక్ట్రిక్ కారు MG కామెట్ EVని భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు కంపెనీ ఇటీవల ఈ కారుకు సంబంధించిన అనేక టీజర్‌లను కూడా విడుదల చేసింది. కొత్త టీజర్ వీడియోలో ఈ ఎలక్ట్రిక్ కారుతో అందమైన స్మార్ట్-కీ కూడా ఇవ్వనుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారుకు సంబంధించిన 5 ప్రత్యేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1)- ఈ ఎలక్ట్రిక్ కారు ఎలా ఉంటుందంటే:
MG కామెట్ GSEV ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు. ఈ ప్లాట్‌ఫారమ్ అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించే వులింగ్ ఎయిర్ EVలో కూడా ఉపయోగించారు. ఈ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన కారు స్టీల్ ఫ్రేమ్‌తో అందించారు. అయితే కారు బాడీ 17 స్టాంపింగ్ ప్యానెల్‌ల నుంచి నిర్మించారు. ఇంతకుముందు, కంపెనీ భారతీయ మార్కెట్లో eZS ఎలక్ట్రిక్ SUVని పరిచయం చేసింది. దీని ప్రారంభ ధర రూ. 23.38 లక్షలు.
2)- కారు పరిమాణం:
అన్నింటిలో మొదటిది, ఇందులో రెండు డోర్లు మాత్రమే అందించారు. అయితే ఇందులో నలుగురికి కూర్చునే ఏర్పాటు ఉంది. దీని లుక్, డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇది మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ కారు క్యాబిన్ మీకు విశాలమైన ప్లేస్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. కారు 2,010mm వీల్‌బేస్‌తో వస్తుంది. ఇది క్యాబిన్‌ను విశాలంగా చేయడంలో సహాయపడుతుంది. నివేదికల ప్రకారం, కంపెనీ ఈ కారును వైట్, బ్లూ, ఎల్లో, పింక్, గ్రీన్ కలిపి మొత్తం ఐదు రంగులలో అందించనుంది.
పొడవు: 2,974 మి.మీ
వెడల్పు: 1,505 మిమీ
ఎత్తు: 1,631 మి.మీ
వీల్ బేస్: 2,010 మి.మీ
అలాగే ఇందులో 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD)తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి ఫీచర్లు ఉన్నాయి.
4)- పనితీరు:
MG కామెట్ EV ఎలక్ట్రిక్ మోటారు, బ్యాటరీ ప్యాక్ మొదలైన వాటి గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారాన్ని పంచుకోలేదు. ఈ కారులో కంపెనీ 20-25kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అందించగలదని విశ్వసిస్తున్నారు. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 నుండి 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇందులో, కంపెనీ 68hp శక్తిని ఉత్పత్తి చేయగల సింగిల్ ఫ్రంట్ యాక్సిల్ మోటారును అందిస్తుంది.
5)- ధర..
MG కామెట్ సరసమైన ఎలక్ట్రిక్ కారుగా అంచనా వేస్తున్నారు. లాంచ్‌కు ముందు దీని ధరపై చాలా ఊహాగానాలు వస్తున్నాయి. కంపెనీ దీనిని రూ. 10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య లాంచ్ చేయగలదని నమ్ముతున్నారు. ప్రస్తుతం, టాటా నెక్సాన్ EV, టాటా టియాగో EV వంటి మోడల్‌లు ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్‌లో అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈ కారు ధర Tiago EV కి దగ్గరగా ఉండే ఛాన్స్ ఉంది.