Ambassador Car: అంబాసిడర్ కార్ పతనానికి కారణం ఎవరు..?

Ambassador Car: అంబాసిడర్ ల్యాండ్‌మాస్టర్ మొదటిసారిగా 1958లో ప్రారంభించారు. ఆర్థిక సంస్కరణల కారణంగా విదేశీ కార్లకు పోటీ ఇవ్వలేక ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.

Update: 2024-08-15 14:30 GMT

Ambassador Car

Ambassador Car: భారత రాజకీయాల్లో, ప్రధానమంత్రులతో సహా నాయకులు, అధికారులు హిందుస్థాన్ మోటార్స్ (HM) అంబాసిడర్ కార్లలో ప్రయాణించారు. ఈ కారు స్వాతంత్రం రాకముందే ఉనికిలోకి వచ్చింది. 58 సంవత్సరాల పాటు ఇది చాలా మంది VIPలను అలాగే ప్రధాన మంత్రులను తీసుకువెళ్లింది. ఈ కారు భారతదేశ చరిత్రకు ఎలా కనెక్ట్ అయింది? ఎలా పతనమైంది? తదితర వివరాలను తెలుసుకుందాం.

అంబాసిడర్ కారులో (HM అంబాసిడర్) చాలా మంది భారతదేశ ప్రధానులు ప్రయాణించారు. ఈ కారులో ప్రయాణించిన ప్రధాన మంత్రుల జాబితాలో ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, హెచ్‌డీ దేవెగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్, అటల్ బిహారీ వాజ్‌పేయి పేర్లు ఉన్నాయి. స్వాతంత్రం రాకముందే భారతదేశంలో అంబాసిడర్ కారును ప్రవేశపెట్టారు. స్వాతంత్రానికి ఐదు సంవత్సరాల ముందు 1942లో BM బిర్లా హిందుస్థాన్ మోటార్స్‌ను స్థాపించారు. గుజరాత్‌లోని ఓఖా పోర్ట్‌లో అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించారు.

1948లో స్వాతంత్రం వచ్చిన ఒక సంవత్సరం తర్వాత దాని ప్లాంట్ గుజరాత్ నుండి బెంగాల్ ఉత్తర పారాలో స్థాపించారు. స్వాతంత్రం రాకముందే ఈ కారు ప్రయాణం ప్రారంభమైనప్పటికీ దీన్ని ప్రారంభించేందుకు ఏళ్లు పట్టింది. స్వాతంత్రం వచ్చిన 11 ఏళ్ల తర్వాత 1958లో అంబాసిడర్ కారును విడుదల చేశారు. డిజైన్ బ్రిటిష్ కారు ఆధారంగా రూపొందించారు. అంబాసిడర్ భారతీయ కారు అయినప్పటికీ, దీని డిజైన్ బ్రిటిష్ కంపెనీ మోరిస్ గ్యారేజ్ (MG) మోరిస్ ఆక్స్‌ఫర్డ్ సిరీస్ 3 నుండి ప్రేరణ పొందింది.

అంబాసిడర్ ల్యాండ్‌మాస్టర్ మొదటిసారిగా 1958లో ప్రారంభించారు. దీన్ని కాలానుగుణంగా అప్‌డేట్ చేశారు.1958 నుండి ప్రధానమంత్రులు, ఇతర మంత్రులు, అధికారులు, సైన్యం, పోలీసులతో సహా సామాన్యుల ఎంపిక అంబాసిడర్ కారు. కానీ 2014లో దీని ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అంబాసిడర్ ఎంకోర్ మోడల్ చివరిగా 2013, 2014 మధ్య అమ్మకానికి అందుబాటులో ఉంది.

1980 చివరలో మారుతీ సుజుకి, ఫియట్ భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడంతో అంబాసిడర్ సమస్యలు మరింత పెరిగాయి. అయితే అంబాసిడర్‌కు అతిపెద్ద సవాలు మారుతి సుజుకి. దీని వాహనాలు మెరుగైన డిజైన్, ఆధునిక ఫీచర్లతో అధిక మైలేజీని కూడా ఇచ్చాయి. 10 సంవత్సరాల తరువాత ఆర్థిక సంస్కరణల కారణంగా భారతదేశం విదేశీ కార్ల కంపెనీలకు తలుపులు తెరిచింది. ఆ తర్వాత అనేక ఆధునిక కార్లు రోడ్లపైకి రావడం ప్రారంభించాయి. దీంతో పాత పద్దతుల్లో నడుస్తున్న అంబాసిడర్‌ ప్రకాశానికి తెరపడింది.

Tags:    

Similar News