IPL 2021 Auction: ఐపీఎల్‌కు కడప జిల్లా చిచ్చరపిడుగు
IPL 2021 Auction: ఐపీఎల్ వేలం పాటలో మారంరెడ్డిని దక్కించుకున్న సీఎస్కే * ఐపీఎల్‌కు ఎంపిక కావడంతో తల్లిదండ్రుల్లో ఆనందం
Andhra Pradesh: అతడికి క్రికెట్ అంటే ప్రాణం పుట్టింది, పెరిగింది మారుమూల గ్రామం అయితేనేం.. అతడి టాలెంట్ ముందు చిన్నబోయాయి. క్రికెట్‌లో ఆరితేరాడు ఉదయం లేచింది మొదలు.. చదువు పక్కన పెట్టి మరీ క్రికెట్ ఆటపైనే ఉండేవారు తన ప్రతిభతో ఇప్పుడు ఐపీఎల్ చోటు దక్కించుకున్నారు. ఇంతకు అతడు ఎవరు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి వయసు 22 సంవత్సరాలు పుట్టింది కడప జిల్లా రాయచోటి సమీపంలోని చిన్నమండెం మండలం నాగూరివాండ్లపల్లి డిగ్రీ వరకు చదివాడు.. కుడిచేతి వాటం మీడియం ఫేస్ బౌలర్ మొన్నటి వరకు హరిశంకర్ రెడ్డి అంటే అంతగా ఎవరికి తెలియదు.. కానీ, ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2021 కి ఎంపిక అయ్యాడు. దాంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తొలి విడత మినీ ఐపీఎల్ వేలం పాటలో హరిశంకర్ రెడ్డికి చాన్స్ లభించింది. ఈ టోర్నిలో ఎంపికైన 292 మంది క్రికెటర్లలో హరిశంకర్ రెడ్డి ఎంపికయ్యాడు. దీంతో తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివెరిస్తోంది.
ప్రస్తుతం మారంరెడ్డి ఆంధ్రా క్రికెటర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2018 జనవరి 11వ తేదీన ఆంధ్రా-కేరళ జట్ల మధ్య విశాఖపట్నంలో జరిగిన టీ20 మ్యాచ్‌తో క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి మ్యాచ్‌లోనే అద్భుతంగా రాణించాడు. ఇప్పటిదాకా 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
ఇదివరకు కడప జిల్లాకే చెందిన పైడికాల్వ విజయ్ కుమార్ ఐపీఎల్ ఆడాడు. మారంరెడ్డి హరిశంకర్ రెడ్డికి ఐపీఎల్ వేలంపాటలో సీఎస్‌కే జట్టు 20 లక్షలకు దక్కించుకుంది. మారంరెడ్డి ఐపిఎల్ కు ఎంపికవ్వడం ఇప్పుడు కడప జిల్లా వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమారుడు ఐపీఎల్ కు ఎంపికవ్వడంతొ తల్లిదండ్రుల అనందానికి అవధులు లేవు. తమ కుమారుడు అ స్దాయికి ఎదుగుతాడని తాము అస్సలు ఉహించలేదని అనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.