Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు గురువారం, 25 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, చవితి (ఉ.08:47 వరకు), ఆశ్లేష నక్షత్రం (మ.12:20వరకు) సూర్యోదయం 5:43am,సూర్యాస్తమయం 6:53 pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Jun 2020 2:40 PM GMT
>> నేడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు రాని పివిపి..
- ఇప్పటికే పివిపి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..
- మరోవైపు 41 సీఆర్పీసీ కింద పివిపి కి నోటీసులు జారీ చేసిన బంజారాహిల్స్ పోలీసులు..
- రేపు విచారణ కు హాజరు కానున్న పివిపి.
- 25 Jun 2020 2:39 PM GMT
@ హైదరాబాద్
- ఈ రోజు పెట్రోలియం ఉత్పత్తుల తో వెళ్తున్న గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పడం తో పలు రైళ్ల రూట్లలో మార్పులు...
- 1.హౌరా - యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్
- 2.ధన్ పూర్ -ksr బెంగుళూరు సిటీ ట్రైన్ లు
- రెగులర్ గా వెళ్లే రూట్లలో కాకుండా విజయవాడ,కృష్ణ కెనాల్ , గుంటూరు, నంద్యాల, దోనే, గూటి, రేణిగుంట మీదుగా వెళ్తాయి...
->> పెట్రోలియం ఉత్పత్తుల తో గుంతకల్ డివిజన్ పరిధిలోని బకారపేట రైల్వే స్టేషన్ కి వెళ్తుండగా సూరా రెడ్డి పాలెం స్టేషన్ వద్ద 5 పెట్రోలియం వ్యాగాన్లు పట్టాలు తప్పాయి...
- అందులో 3 వ్యాగాన్లు పూర్తిగా కాలిపోయాయి...
- వెంటనే సహాయ రైళ్ళు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారభించినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది...
- 25 Jun 2020 12:38 PM GMT
విశాఖ కేర్ ఆసుపత్రిలో కరోనా కలకలం
- విజయవాడలో మృతి చెందిన హైకోర్టు ఇన్ చార్జి రిజిస్ట్రార్ జనరల్ మృతదేహం విశాఖ కేర్ ఆసుపత్రికి తరలింపు.
- మృతదేహంతో విజయవాడ నుంచి విశాఖ వచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు.
- కేర్ ఆసుపత్రిలో మృతదేహానికి పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించిన పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసులు, ప్రముఖులు.
- మృతదేహానికి జరిపిన కరోనా పరీక్షల్లో హైకోర్టు ఇన్ చార్జి రిజిస్ట్రార్ జనరల్ కు పాజిటివ్ గా నిర్థారణ.
- 25 Jun 2020 12:35 PM GMT
విశాఖ జిల్లాలో సచివాలయం ఉద్యోగికి ప్రేమ వేదింపులు...
- గంపారాయి సచివాలయం డిజిటల్ సహాయకురాలు. ప్రేమపేరుతో వేదిస్తున్న యువకుడు..
- రూఢ కోట గ్రామానికి చెందిన చిట్టపులి ప్రశాంత్ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి..
- గత కొద్ది కాలంగా మద్యం సేవించి ప్రేమ పేరుతో వేధింపులకు దిగాడని చెబుతున్న ఝాన్సీ లక్ష్మీ దేవి.
- బుదవారం లక్ష్మీదేవి పై దాడి చెసిన ప్రశాంత్.
- పోలీసులకు ఫిర్యాదు. ప్రశాంత్ పై 332 , 342, 448,353,354B, 506, 509 సెక్షన్ కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించిన పోలీసులు.
- 25 Jun 2020 12:34 PM GMT
జీడి పంట వేసిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి.. పవన్ కళ్యాణ్..
- ఈ యేడాది కరోనా ప్రభావంతో జీడి పంట మీద ఆధారపడ్డ రైతులు తీవ్ర నష్టాల బారినపడ్డారు..
- తీరప్రాంత జిల్లాల్లో సుమారు లక్ష హెక్టార్లలో ఈ పంట ఉంది.
- బస్తా జీడి పిక్కల ధర గతేడాది రూ.12 వేలు – రూ.14 వేల మధ్య ఉంటే ఈ యేడాది రూ.8 వేలు మాత్రమే పలుకుతోందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది...
- శ్రీకాకుళం జిల్లాలోని జీడి మామిడి రైతులు తాము ఏ విధంగా నష్టాల పాలవుతున్నదీ, ఎలా అప్పుల పాలవుతున్నదీ జనసేన దృష్టికి తీసుకు వచ్చారు...
- జీడి రైతుల సాగు ఖర్చులు నిమిత్తం బ్యాంకుల నుంచి రుణ సదుపాయం అందడం లేదు...
- దళారుల నుంచే అప్పులు చేసి చివరకు వాళ్ళకే పంటను అమ్ముకోవాల్సి వస్తోంది...
- ఫలితంగా రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. జీడి పంట ప్రభుత్వం నిత్యావసర సాగు కాదని చెబుతూ మద్దతు ధర ప్రకటించకపోవడం సరికాదు..
- పొగాకు వంటి వాణిజ్య పంటలకు సంబంధిత బోర్డులు ఏర్పాటు చేసి వాటి ద్వారా సంబంధిత రైతులు నుండి కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం జీడి పంట కొనుగోలు విషయంలో కూడా అదే విధంగా వ్యవహరించాలి...
- బస్తాకు రూ.15వేలు గిట్టుబాటు ధర ప్రకటిస్తే సంబంధిత రైతులకు ఊరట లభిస్తుంది...
- తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించడంతోపాటు, సేంద్రీయ ఎరువులను అందుబాటు ధరలకు సరఫరా చేయాలి...
- పంట నిల్వకు అవసరమైన గిడ్డంగులను ప్రభుత్వం నిర్మిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది...
- ఈ విషయంలో ప్రభుత్వం, ఉద్యాన శాఖ తక్షణం స్పందించాలి...
- 25 Jun 2020 12:33 PM GMT
హైదరాబాద్ లో ghmc ప్రధాన కార్యాలయం లో పెరిగి పోతున్న కరోనా పాజిటివ్ కేస్ ల సంఖ్య
- 32 కు చేరిన కేస్ ల సంఖ్య
- ఆఫీసు కు అనుబంధం గా ఉన్న బ్యాంక్ ఉద్యోగులకి పాజిటివ్ గా నిర్దారణ
- బ్యాంక్ కార్యకలాపాల కోసం వచ్చిన వారిలో టెన్షన్
- 25 Jun 2020 12:10 PM GMT
160 లీటర్ల బెల్లం ఊట ధ్వసం
- ఈరోజు బందరు రూరల్ SI లక్ష్మీ నరసింహ మూర్తి గారు సిబ్బందితో కలిసి గోకవరం గ్రామం వద్ద సరుకు తోటలో భూమిలో పతిపెట్టిన బెల్లం ఊటను గుర్తించి, ధ్వసం చేశారు.
- 25 Jun 2020 9:37 AM GMT
విశాఖ ప్రహలాదపురం విరాట్ నగర్ షార్ట్ సర్క్యూట్ వల్ల లారీ దగ్ధం...
- గుంటూరు నుంచి విశాఖ వచ్చిన లారీ వేస్ట్ క్లాత్ లోడ్ అన్లోడ్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ అవడం వలన లారీ దగ్ధం...
- సుమారు లక్ష రూపాయల సరుకు కాలి బూడిద అయింది...
- మంటలు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది...
- 25 Jun 2020 9:36 AM GMT
అమరావతి: ఉండవల్లి కరకట్ట ఉద్రిక్తత చోటు చేసుకుంది..
- వైకాపా సర్కారు ప్రజావేదిక కూల్చి ఏడాది కావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని తెదేపా నేతలు నిర్ణయించారు.
- దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు.
- ప్రజావేదిక వద్దకు వచ్చే నాలుగు రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
- తెదేపా నేతల వాహనాలు మినహా మిగతా వాటిని అనుమతించారు.
- ఉండవల్లి కరకట్ట వద్దకు చేరుకున్న తెదేపా నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, టి.శ్రావణ్‌కుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు తదితరులను అడ్డుకున్నారు.
- దీంతో పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
- 25 Jun 2020 8:57 AM GMT
షోకాజ్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు రివర్స్ కౌంటర్..
షోకాజ్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు రివర్స్ కౌంటర్..
షోకాజ్ నోటీసుకు సమాధానంలో విజయసాయిరెడ్డి కి ఎంపీ సూటి ప్రశ్నలు..
రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీలోకి మీరు జాతీయ కార్యదర్శి ఎలా అవుతారు..
లెట్టర్ హెడ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఎలా ఉంటుంది..
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని మాత్రమే వుండాలికదా..
వైసీపీ లో క్రమశిక్షణ సంఘం ఉందా..
క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందా..?
సంఘం మినిట్స్ ఉంటే నాకు పంపండి..
క్రమశిక్షణ సంఘం చైర్మన్, సభ్యులు ఏవరు..?
విజయసాయిరెడ్డి కి ప్రశ్నల వర్షం కురిపించిన ఎంపీ రఘురామకృష్ణం రాజు..
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire