Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 25 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు గురువారం, 25 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, చవితి (ఉ.08:47 వరకు), ఆశ్లేష నక్షత్రం (మ.12:20వరకు) సూర్యోదయం 5:43am,సూర్యాస్తమయం 6:53 pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Jun 2020 4:18 PM GMT
- తెలంగాణ లో ఎంసెట్ గతంలో ప్రకటించిన తేదీ ల్లోనే జరుగుతాయని ప్రకటించిన కన్వీనర్
- జులై 6 నుంచి 9 వరకు జరగనున్న టీఎస్ ఎంసెట్
- ఎగ్జామ్ సెంటర్ లు మార్చుకోవాలనే విద్యార్థులు రేపటి లోగా ఆన్లైన్ లో మార్చుకోవాలని ప్రకటన
- 25 Jun 2020 4:17 PM GMT
- మంత్రి పువ్వాడ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ బాలసాని
- తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ శుక్రవారం భద్రాచలం నియోజకవర్గ0 లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ బాలసాని మంత్రి పర్యటన ఏర్పాట్లను దెగ్గరవుండి పరిశీలించారు.
- 25 Jun 2020 4:03 PM GMT
@అసోం
- ఈశాన్య రాష్ట్రం అసోంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు.
- గత 24 గంటలుగా ఎడతెరపిలేని వానలు కురుస్తుండటంతో రాష్ట్రంలో వరదలు పోటెత్తాయి.
- ముఖ్యంగా టిన్‌సుకియాలోని డమ్‌డమ్ ఏరియాను భారీ వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై భారీగా వరదనీరు నిలిచింది.
- టిన్‌సుకియాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
- దీంతో ఆయా పరిసరాల్లోని గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
- వీధుల్లో నడుములోతు నీరు నిలువడంతో ఇండ్లు నీట మునిగాయి.
- 25 Jun 2020 2:58 PM GMT
>> అమరావతి
- వైద్య, ఆరోగ్యశాఖ రీట్వీట్
- కరోనా టెస్ట్ ల విషయంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
- RT PCR టెస్ట్ లో' కచ్చితత్వం శాతం 67 శాతం మాత్రమే.
- అంటే సంబంధిత వ్యక్తిలో 33 శాతం వైరస్ ఉనికి ఉన్నప్పటికీ టెస్ట్ ఫలితాలు నెగటివ్ అనే చూపుతాయి
- ఆ వ్యక్తిలో కోవిడ్ వైరస్ 100 శాతం కచ్చితంగా వుంటే ఫలితాలు పాజిటివ్ అని నిర్ధారిస్తాయి.
- అంటే ఆ వ్యక్తిలో కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ తీవ్రంగా వుందని అర్థం.
- పేషెంట్ రికవరి దశలో వున్నప్పుడు (అంటే వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన కొద్ది రోజుల తరువాత) టెస్ట్ ఫలితాలు నెగటివ్ అని చూపుతాయి.
[- దీపక్ రెడ్డి విషయంలో తొలి టెస్ట్ ఫలితాలు పాజిటివ్ అని చూపాయంటే, ఆయన నూరుశాతం వైరల్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారని అర్ధం.
- రెండో టెస్ట్ నెగటివ్ అని చూపిందంటే అందుకు రెండు కారణాలుంటాయి
- ఆయనలో వైరల్ ఇన్ఫెక్షన్ స్థాయి 33 శాతం మాత్రమే వుండటం లేదా ఆయన రికవరీ దశలో వుండటం
- ఈ దశలో కరోనా టెస్ట్ ఫలితాలు నెగటివ్ అన్న ఫలితాలనే చూపుతాయి
- సాంకేతికపరమైన ఈ అంశాలపై స్పందించటానికి ముందు సంబంధిత వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎపి వైద్య ఆరోగ్య శాఖ కోరుతోంది
- ఆయా వ్యక్తులు బాధ్యతా రహితంగా చేసే ఇటువంటి వ్యాఖ్యలు ల్యాబ్స్ లో పనిచేస్తున్న సంబంధిత సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి
- ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజల దృష్టిలో అనుమానాలు రేకెత్తించటం ఎవరికీ మంచిది కాదనే విషయాన్ని వారు గ్రహించాల్సిన అవసరం ఉంది
@ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ
- 25 Jun 2020 2:56 PM GMT
@ అమరావతి
>> కన్నా లక్ష్మీనారాయణ .రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ
- రేపు ఆంధ్రప్రదేశ్ భాజపా ఆధ్వర్యంలో కోస్తాంధ్ర పార్లమెంట్ జిల్లాల మూడవ వర్చువల్ ర్యాలీ.
- ముఖ్య అతిధి మరియు వక్తగా కేంద్ర ఆర్ధికమంత్రి, శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు
- విజయవాడలో వెన్యూ కన్వెన్షన్ హాల్ వేదికగా రేపు సాయంత్రం 4 గంటలకు
- 25 Jun 2020 2:53 PM GMT
@ పశ్చిమ గోదావరి
- అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయడమే దుర్మార్గమైతే ..
- చికిత్స దశలో అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు మరింత దుర్మార్గం.
- టిడిపి నాయకులను ఇప్పటివరకు కేసులతో వేధించారు
- అరెస్టులతో బెదిరించారు, ఇప్పుడు ఏకంగా హతమార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది.
- అచ్చెన్నాయుడుకు ప్రాణహాని తలపెడితే ప్రభుత్వం తలకిందులు అవుతుంది..
- YCP కి పుట్టగతులు ఉండవు...
- సర్జరీ చేయించుకొన్న వ్యక్తిపై మానవత్వం చూపలేదు..
- అమానుషంగా ప్రవర్తించడం ప్రభుత్వ ఫ్యాక్షన్ స్వభావాన్ని చూపిస్తుంది.
- పాలకొల్లు టిది ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు
- 25 Jun 2020 2:49 PM GMT
@ అమరావతి
- ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి...
- మంత్రి బొత్స సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్లు, టిడ్కో అదికారులతో వీడియో కాన్ఫరెన్సు
- జూలై 8 వ తేదీన పంపిణీ చేయదలచిన ఇళ్లు, ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని విధాలుగా సన్నద్దం కావాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు.
- ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలన్నారు.
- ఇళ్ల పట్టణాలు, ఇళ్లు కేటాయింపు ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని మున్సిపల్ కమిషనర్లు, పట్టణ టిడ్కో అధికారులకు ఆయన స్పష్టం చేశారు.
- 25 Jun 2020 2:48 PM GMT
- ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ లో అయిదుగురు వైద్యులకు కరోనా పాజిటివ్....
- గత కొద్ది రోజులుగా ఎర్రగడ్డ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కరోన టెస్టులకు క్యాంప్ గా ఏర్పాటు...
- 25 Jun 2020 2:48 PM GMT
@ రేవంత్ రెడ్డి ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
- వీకే సింగ్ వీఆర్ఎస్ ప్రాధాన్యత కలిగిన అంశం
- ఈ ప్రభుత్వంలో కొనసాగలేనని ఆయన కేంద్రానికి లేఖ రాశారు.
- పోలీసు వ్యవస్థలో ప్రైవేటు సైన్యంగా పని చేసేవారికి, సొంత సామాజికవర్గం వారికి మాత్రమే పెద్దపీట వేస్తారా?
- ఫోన్ ట్యాపింగ్ లు, ప్రత్యర్థులను వేధించేవారికి మాత్రమే పోస్టింగులా!
- ప్రభాకర్ రావు (ఐజీ-ఎస్ఐబి), వెంకటేశ్వరరావు (డిఐజీ), రాధాకిషన్ రావు (డీఎస్పీ-టాస్క్ ఫోర్స్) ఈ ముగ్గురూ నెలాఖరుకు రిటైరవుతున్నారు.
- ఈ ముగ్గురినీ తిరిగి కొనసాగించడానికి ఫైల్ సిద్ధం చేశారు.
- వీకే సింగ్ ప్రమోషన్ పై సీఎస్ కు లేఖ రాస్తే ఉలుకుపలుకు లేదు.
- హైదరాబాద్ పరిధిలోని కమిషనరేట్లలో పూర్తిగా కేసీఆర్ ప్రైవేటు సైన్యం పని చేస్తోంది
- డీజీపీ ఉత్సవ విగ్రహం గా మాత్రమే ఉన్నారు.
- 15 ఏళ్ల క్రితం రిటైర్మెంట్ అయినా సొంత సామాజికవర్గం వాళ్లను తీసుకువచ్చి కేసీఆర్ కీలక పోస్టుల్లో పెట్టాడు.
- పోలీసు శాఖలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజికవర్గాలకు చెందిన సమర్థవంతమైన అధికారులు లేరా?
- కేసీఆర్ సామాజికవర్గం వారికి పెద్దపీఠ వేసి... మిగతా వారికి అన్యాయం చేస్తారా?
- రిటైరవుతోన్న ముగ్గురు అధికారులకు కొనసాగింపు ఇస్తే కోర్టులో కేసు వేస్తాను
- 25 Jun 2020 2:44 PM GMT
@ బండి సంజయ్,తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
- ఎమెర్జెన్సీ పోరాట యోధుల
- స్ఫూర్తితో ప్రజాస్వామిక తెలంగాణకై పోరాడుదాం
- కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే భారతీయ జనతా పార్టీ ఎజెండా
- ఎమెర్జెన్సీ పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజాస్వామిక తెలంగాణకై పోరాడుదాం
- కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం చేయడమే భారతీయ జనతా పార్టీ ఎజెండా
- నాడు ఇందిరాగాంధీ ఎమెర్జెన్సీ అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన పోరాట యోధుల స్ఫూర్తిగా నేడు నయా నిజాం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire