Live Updates:ఈరోజు (జూన్-25) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు గురువారం, 25 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, చవితి (ఉ.08:47 వరకు), ఆశ్లేష నక్షత్రం (మ.12:20వరకు) సూర్యోదయం 5:43am,సూర్యాస్తమయం 6:53 pm

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • 25 Jun 2020 5:42 AM GMT

    @ చల్లా వంశీచంద్ రెడ్డి *మాజీ ఎమ్మెల్యే,ఏఐసీసీ కార్యదర్శి*

    - రైతులను నట్టేట ముంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం...

    - "కల్వకుంట్ల కుటుంబ"అధికార పీఠం పదిలం కోసమే రైతుబంధు

    - దశలవారీగా మొత్తం 36 లక్షల 90 వేల మంది రైతులకు డబ్బులు చెల్లించకుండా కుచ్చుటోపి

    - ఇప్పటివరకు మొత్తం రూ.7,471 కోట్లు బకాయిలు

  • 25 Jun 2020 5:41 AM GMT

    ♦♦హరితహారం♦♦ 

    - వికారాబాద్ జిల్లా : 6వ విడుత హరితహారం లో భాగంగా బొంరాస్ పేట్ మండలంలోని అటవీశాఖ పరిధిలో అలుగు వద్ద మొక్కలు నాటిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి..

    - రంగారెడ్డి జిల్లా : తలకొండపల్లి మండలం పడకల్ పరిధిలోని ఫారెస్టులో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్.

    - మహబూబ్ నగర్ జిల్లా :6వ విడత హరితహారం కార్యక్రమం లో భాగంగా జడ్చర్ల పట్టణం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి , పాల్గొన్న పోలీస్ అధికారులు...

  • 25 Jun 2020 5:39 AM GMT

    ♦♦♦అమరావతి♦♦♦

    - ప్రజా వేదిక కూల్చి నేటికి ఏడాది

    - ప్రజా వేదిక శిథిలాల వద్దకు టిడిపి నేతలు

    - కరకట్ట వద్ద హైటెన్షన్

    - ప్రజా వేదిక వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు

    - ఎలాంటి నిరసనలకు అనుమతి లేదన్న పోలీసులు

    - కరకట్ట వద్ద టిడిపి నేతలను అడ్డుకున్న పోలీసులు

    - పోలీసులతో టిడిపి నేతలు వాగ్వాదం.

  • 25 Jun 2020 5:38 AM GMT

    ♦♦♦అమరావతి♦♦♦

    - ప్రజా వేదిక కూల్చి నేటికి ఏడాది

    - ప్రజా వేదిక శిథిలాల వద్దకు టిడిపి నేతలు

    - కరకట్ట వద్ద హైటెన్షన్

    - ప్రజా వేదిక వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు

    - ఎలాంటి నిరసనలకు అనుమతి లేదన్న పోలీసులు

    - కరకట్ట వద్ద టిడిపి నేతలను అడ్డుకున్న పోలీసులు

    - పోలీసులతో టిడిపి నేతలు వాగ్వాదం.

  • 25 Jun 2020 5:36 AM GMT

    గుంటూరు♦♦

    - మరికొద్దిసేపటిలో అచ్చెన్నాయుడుని విచారించనున్న ఏసీబీ

    - ఏసీబీ జాయింట్ జాయింట్ డైరెక్టర్ రవి కుమార్ ఆధ్వర్యంలో విచారణ

    - విజయవాడ నుంచి రానున్న ప్రత్యేక బృందం

    - ఈఎస్ఐ స్కాంలో ఈనెల 12న అచ్చెన్నాయుడు అరెస్టు

    - అనారోగ్యం కారణంగా 13 తెల్లవారుజామున జిజిహెచ్ కు తరలించిన అధికారులు

    - జీజీహెచ్ అచ్చెంనాయుడుకి రెండోసారి ఆపరేషన్

    - కోర్టు ఆదేశాలతో ఇవాళ నుంచి మూడు రోజుల పాటు విచారించనున్న ఏసీబీ

    - జిజిహెచ్ కు పెద్ద సంఖ్య లో చేరుకున్న పోలీసులు.

  • 25 Jun 2020 5:35 AM GMT

    హరితహారం♦♦

    - వేల్పూర్ మండలం పచ్చల నడకూడలో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని మొక్కలు నాటి ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

    - కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన ఎమ్మెల్సీలు రాజేశ్వర్, ఆకుల లలిత, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు.

  • 25 Jun 2020 5:33 AM GMT

    - సికింద్రాబాద్ లో బోయిగూడ లో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పార్కును ప్రారంభించి, మొక్కలునాటి 6 వ విడత తెలంగాణ కు హరితహారం కార్యక్రమము ను ప్రారంభించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్

    - కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జి హెచ్ ఎం సి మేయర్ బొంతు రామ్మోహన్, కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్

  • 25 Jun 2020 4:05 AM GMT

    బ్రేకింగ్ న్యూస్: ప్రకాశం జిల్లా సూరారెడ్డిపాళెం-టంగుటూరుల మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, వంతెన పై నుండి పడ్డ 5 ఆయిల్ ట్యాంకర్ బోగీలు, ఎగిసిపడుతున్న అగ్నికీలలు, సహాయక చర్యలు చేపడుతున్న బిట్రగుంట - విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు,సిబ్బంది. నాలుగు ఆయిల్ ట్యాంకర్ల బోగీలు దగ్ధం..




  • 25 Jun 2020 3:45 AM GMT

    టికెట్‌ తనిఖీకి ప్రత్యేక కౌంటర్లు

    - రాజమహేంద్రవరం: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం రైల్వే స్టేషనులో టికెట్‌ తనిఖీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.

    - ఆ సందర్భంగా టికెట్‌ తనిఖీ అధికారి కేశవభట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ... ప్రయాణికులు రాకపోకలు సాగించే ప్రధాన ద్వారం వద్ద వీటిని ఏర్పాటు చేశామన్నారు.

    - టికెట్లు తనిఖీ చేసే సిబ్బంది వైరస్‌ బారిన పడకుండా ఇవి రక్షణ కల్పిస్తాయన్నారు.  



  • 25 Jun 2020 3:27 AM GMT

    ఏపీలో ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సీరియస్ వార్నింగ్

    - ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ ప్రభావం తగ్గగానే స్కూల్స్ తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

    - అదే సమయంలో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు కూడా విద్యార్ధులపై దృష్టిసారించాయి.

    - ఈ ఏడాది కూడా తమ టీచర్లను విద్యార్దుల ఇళ్లకు పంపి అడ్మిషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.

    - అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

    - కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో అడ్మిషన్ల కోసం టీచర్లను విద్యార్ధుల ఇళ్లకు పంపడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.

    - పూర్తి వివరాలు  

Print Article
More On
Next Story
More Stories