Live Updates: ఈరోజు (సెప్టెంబర్-25) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 25 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | నవమి: రా.10-31వరకు తదుపరి దశమి | పూర్వాషాఢ నక్షత్రం రా.11-06 వరకు తదుపరి ఉత్తరాషాఢ | వర్జ్యం: ఉ.9-00 నుంచి 10-34 వరకు | అమృత ఘడియలు: సా.6-24 నుంచి 7-58 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-16 నుంచి 9-04 వరకు తిరిగి మ.12-16 నుంచి 1-04 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-53
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 25 Sep 2020 9:55 AM GMT
Balasubrahmanyam: ఎస్ పి బాలసుబ్రమణ్యం మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు: ఆదిమూలపు సురేష్!
అమరావతి..
-గానగంధర్వుడు బాలు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్.
-సంగీత ప్రపంచంలో బాలు ప్రస్థానం సువర్ణాక్షరాలతో లిఖించదగినది.
-కళాభిమానుల గుండెల్లో బాలు చిరస్తాయి గా నిలిచిపోతారు.
-బాలు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన మంత్రి సురేష్.
- 25 Sep 2020 9:52 AM GMT
Balasubrahmanyam: చెన్నైలోని బాలసుబ్రహ్మణ్యం ఇంటికి బాలు పార్థివ దేహం..
సినిమా పిఆర్ఓ నిఖిల్ క్రిష్ణ..
-సాయంత్రం 4గంటలకు ఇంటికి తరళింపు
-ఆయన అంతిమ సంస్కారాలు రెడ్ హిల్స్ సమీపంలోని ఫామ్ హౌస్ లో చేయాలని నిర్ణయించారు.
-అంతిమ సంస్కారాలు రాత్రికి చేయాలా ఉదయం చేయాలా అన్నది వెంటనే ప్రకటిస్తాం
- 25 Sep 2020 9:46 AM GMT
Balasubrahmanyam: శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది..
వెంకయ్యనాయుడు..ఉపరాష్ట్రపతి..
-ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది.
-వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
- 25 Sep 2020 9:37 AM GMT
Kakinada updates: గానగంధర్వుడు బాలు మరణంతో విషాదంలో గంగాధం మాస్టారు కుటుంబసభ్యులు..
తూర్పుగోదావరి :
కాకినాడ:
-హెచ్ఎంటివి తో గంగాధరం మాస్టార్ కుమారుడు పెద్దిరెడ్డి సతీష్,.
-నెల్లూరు లోని కొందరు స్నేహితుల ద్వారా నాన్న గారికి బాలు గారు పరిచయం..
-వారి స్నేహానికి సంగీత కారణం.. కాకినాడలో నాటకరంగ పై ఏర్పాటు చేసిన మంజుల ఆర్ట్స్ అభివృధ్ధికి బాలు ఎంతో కృషి చేశారు..
-మంజుల ఆర్ట్స్ కి బాలు కార్యదర్శిగా వ్యవహరించారు.. మైమ్ షో లకు నాన్నగారు సంగీతం అందించేవారు..
-గంగాధం ఆర్కెస్ట్రా ప్రతీ కార్యక్రమానికి బాలు వచ్చారు.. ఆయన కోలుకుని తిరగి వస్తారని భావించాం..
- 25 Sep 2020 9:29 AM GMT
Balasubrahmanyam: గానగంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం..నారా లోకేష్!
అమరావతి..
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..
-ఆబాల గోపాలాన్ని తన గానంతో అలరించిన ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం కన్నుమూయడం.. సంగీత, సాహిత్య, సినీ, కళా ప్రపంచానికి తీరనిలోటు.
-దశాబ్దాలుగా భారతీయ భాషలన్నింటిలోనూ 40 వేలకు పైగా పాటలు పాడిన సుస్వరాల సుమధుర బాలు మనమధ్య లేకపోవచ్చు.
-ఆయన పాట, మాట, బాట, నటన, సంగీతం అన్నీ చిరకాలం జీవించే ఉంటాయి.
- 25 Sep 2020 9:22 AM GMT
Balasubrhmanyam: దేశం గర్వించే మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం!
తూర్పుగోదావరి.. కొత్తపేట...
శిల్పి ఒడియార్ రాజకుమార్ కామెంట్..
-ఆయన మరణం జీర్ణించుకోలేకపోతున్నాను.
-ఆయన మనసు మెచ్చిన రీతిలో వారి తల్లిదండ్రుల విగ్రహాలను తీర్చిదిద్దా..
-తనకు విగ్రహాన్ని తీర్చిదిద్దాలని కోరిన బాలు..
-40 వేలకు పైగా పాటలు పాడిన మధుర గాయకుడు బాలు మరణం సంగీత లోకానికి ఎప్పటికీ తీరని లోటు..
- 25 Sep 2020 9:15 AM GMT
Balasubrahmanyam: తెలుగు జాతి ముద్దుబిడ్డ బాల సుబ్రమణ్యం: చంద్రబాబు!
అమరావతి..
-మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రగాఢ సంతాపం..
-తన గానంతో ప్రజల గుండెల్లో అజరామరుడు.
-గాన గంధర్వుడు తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎస్ పి బాలసుబ్రమణ్యం మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
-బాల సుబ్రమణ్యం మృతి భారత చలన చిత్ర పరిశ్రమకే కాదు, కళాకారులు అందరికీ, యావత్ సంగీత ప్రపంచానికే తీరనిలోటు.
-16భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కి తెలుగు జాతి ఖ్యాతిని దిగంతములకు వ్యాప్తి చేశారు..
-ఆయన కోలుకుంటారు, ఆరోగ్యంతో తిరిగి వస్తారు, మళ్లీ తన పాటలతో పరవశింపచేస్తారని అందరూ గంపెడాశతో ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన మృతి వార్త ఆశనిపాతమైంది.
-గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శ్రోతలపై, ప్రేక్షకులపై చెరగని ముద్రవేశారు.
-పద్మశ్రీ, పద్మభూషణ్ తోపాటు ఆయన సాధించిన అనేక జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డులే బాలసుబ్రమణ్యం ప్రతిభకు కొలమానాలు.
-భౌతికంగా బాల సుబ్రమణ్యం మనకు దూరం అయినా, తన పాటల్లో ప్రజల గుండెల్లో అజరామరుడుగా నిలిచిపోయారు.
-ఎందరో వర్తమాన గాయకులకు మార్గదర్శి. కళాకారులు అందరికీ స్ఫూర్తిదాయకుడు.
-తెలుగుదేశం పార్టీ ప్రచారంలో ఆయన పాటలు పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం, ఉత్సాహం పరవళ్లు తొక్కేది.
-ఎస్ పి బాల సుబ్రమణ్యం కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
- 25 Sep 2020 9:09 AM GMT
S.P.Balasubrahmanyam: 'సింహపురి'లో జన్మించిన గాయకులు..ప్రపంచం గర్వించదగ్గ గానగంధర్వులు..
అమరావతి..
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
-"నేనున్నది మీలోనే..ఆ నేను మీరేలే..నాదన్నది ఏమున్నది నాలో" అంటూ వెళ్లిపోయారా బాలుగారూ
-ఏడ్చినా..నవ్వినా..మాటాడినా..పాటాడినా..ఏదైనా బాలుగారి నోట..ప్రతీది పాటే
- 25 Sep 2020 9:06 AM GMT
Balasubrahmanyam: ఎస్పీ మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు: అవంతి శ్రీనివాసరావు!
విశాఖ..
మంత్రి అవంతి శ్రీనివాసరావు సంతాపం
-ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం మరణం సినీ ప్రపంచానికి తీరని లోటు
-మారుమూల శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రజలతో ఎస్పీ మమేకమైన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయి
- 25 Sep 2020 8:47 AM GMT
Vijayawada-Rajbhavan: గాణ గంధర్వుడు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్!
విజయవాడ రాజ్ భవన్:
-గాణ గంధర్వుడు పద్మ భూషణ్ అవార్డు గ్రహీత ప్రఖ్యాత గాయకుడు శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అకాల మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్.
-16 బాషలలో 40 వేలకు పైగా పాటలు పాడి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని గవర్నర్ తెలిపారు.
-వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన గవర్నర్.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire